
- జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు ఎంపిక
న్యూఢిల్లీ: జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ప్రకటించిన ఇండియా టీమ్‌ను బీసీసీఐ స్వల్పంగా మార్చింది. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ మెంబర్స్ సంజూ శాంసన్, శివం దూబే, యశస్వి జైస్వాల్.. భారీ తుఫాన్ కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోవడంతో తొలి రెండు టీ20ల్లో వాళ్ల స్థానాల్లో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాను టీమ్‌లోకి తీసుకుంది. ఇక ఇండియా నుంచి చీఫ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి మిగతా సభ్యులు జింబాబ్వే బయలుదేరారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అమెరికా నుంచి వెళ్లి నేరుగా టీమ్‌తో కలవనున్నాడు. ఈ నెల 6 నుంచి మొదలయ్యే ఈ టూర్‌లో ఇండియా.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. మరోవైపు ఈ సిరీస్‌లో ఇండియాతో తలపడే జింబాబ్వే టీమ్‌కు సికందర్ రజా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.