ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా జరుగుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్‌లో మూడోసారి (రాజస్థాన్ రాయల్స్) స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ను బీసీసీఐ ఒక మ్యాచ్ సస్పెండ్ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ తమ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడబోయే మ్యాచ్ కు దూరం కానున్నాడు. మ్యాచ్ సస్పెండ్ చేయడంతో పాటు పంత్ కు రూ 30 లక్షల జరిమానా విధించారు.
ఏప్రిల్ 1న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ పంత్ కు రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తర్వాత వెంటనే ఢిల్లీ కెప్టెన్ వెంటనే అదే తప్పును రిపీట్ చేశాడు. నిన్న (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పంత్‌కి రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. కెప్టెన్ పంత్ కు మాత్రమే కాదు.. ఢిల్లీ జట్టులోని ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు.
ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ తో సహా ఢిల్లీ జట్టులోని ప్లేయింగ్ 11 లో ఉన్న వారికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే పంత్ కీలకం. ఈ సీజన్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొడుతున్న పంత్..దూరం కావడం ఢిల్లీ జట్టులో ఆందళోన కలిగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. 12 న బెంగళూరుతో, 14న లక్నోతో మ్యాచ్ లు ఉన్నాయి.
🚨 Rishabh Pant suspended for a match and fined 30 Lakhs for maintaining slow overrate. 🚨 pic.twitter.com/wpbUXd48nc
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2024