ఐపీఎల్‌‌ కోసం బీసీసీఐ లాస్ట్ ఆప్షన్!

ఐపీఎల్‌‌ కోసం బీసీసీఐ లాస్ట్ ఆప్షన్!

విదేశాల్లో నిర్వహణ లాస్ట్‌‌ ఆప్షన్‌‌ అన్న బీసీసీఐ వర్గాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌‌ వల్ల నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌‌–2020 గురించి మళ్లీ చర్చ మొదలైంది. లీగ్‌‌ నిర్వహణ కోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఐపీఎల్‌‌ను విదేశాలకు తరలించాలనే ఆలోచన కూడా చేస్తున్నదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘బీసీసీఐ అన్ని అప్షన్స్‌‌ను పరిశీలిస్తున్నది. ప్లేయర్ల హెల్త్‌‌కు రిస్క్‌‌ లేకపోతే ఇక్కడే నిర్వహిస్తాం. ఇక్కడ పరిస్థితులు అనుకూలించక, సరైన విండో లభిస్తే.. విదేశాలకు తరలించే ఆలోచన కూడా చేస్తాం. అయితే అది మాకున్న లాస్ట్‌‌ ఆప్షన్‌‌. గతంలోనూ లీగ్‌‌ను వేరే దేశాల్లో నిర్వహించాం. కాబట్టి అన్ని ఆప్షన్స్‌‌ ఓపెన్‌‌గా ఉన్నాయి’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌‌ ఫ్యూచర్‌‌ మొత్తం ఐసీసీ నిర్ణయంపై ఉంది. ఒకవేళ టీ20 వరల్డ్‌‌కప్‌‌ను పోస్ట్‌‌పోన్‌‌ చేస్తే ఆ విండోలో లీగ్‌‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే ఈనెల 10 వరకు వెయిట్‌‌ చేయాల్సిందే. ఐపీఎల్‌‌ గురించి ఎలాంటి చర్చ చేయాలన్నా.. ముందు టీ20 వరల్డ్‌‌కప్‌‌పై ఐసీసీ క్లారిటీ ఇవ్వాలని సదరు వర్గాలు కూడా చెబుతున్నాయి. మరోవైపు ఐపీఎల్‌‌ను హోస్ట్‌‌ చేస్తామని ఇప్పటికే యూఏఈ, శ్రీలంక ఆఫర్స్‌‌ ఇచ్చాయి. కానీ, దీనిపై చర్చించడం తొందరపాటు అవుతుందని  బోర్డు గతంలోనే తోసి పుచ్చింది.

For More News..

వీడియో కాల్స్‌తో విసుగెత్తుతున్రు

గుళ్లలో తీర్థ ప్రసాదాలు వద్దు

ఈ టైమ్‌లో ఎగ్జామ్స్‌ పెట్టాలనుకుంటున్నరా?