ఐపీఎల్ నుంచి తప్పుకునే ఫారెన్ ప్లేయర్ల విషయంలో 10 మంది ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగబోయే ఐపీఎల్ నుంచి కొంతమంది విదీశీ ఆటగాళ్లు అనవసర సాకులు చెప్పి తప్పుకుంటున్నారని.. వీరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జట్ల ఫ్రాంచైజీలు చెప్పారట. దీంతో వీరి అభ్యర్ధనను బీసీసీఐ గౌరవించినట్టు సమాచారం. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకునే విదేశీ క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది.
వేలంలో కొన్న ఆటగాళ్లు చివరి నిమిషంలో ఏదైనా కారణం చేత తప్పుకుంటే వారిని రెండేళ్లు ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయనున్నారు. ఇందులో భాగంగా గాయాలు.. వ్యక్తిగత కారణాలు.. దేశం కోసం ఐపీఎల్ ను మధ్యలోనే వదిలేయడం లాంటివి చేస్తే వారిపైనా రెండేళ్లు నిషేధం తప్పదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుకుంటే వారికి ఈ నియమం వర్తిస్తుంది. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాన్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు దూరమవ్వడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. వానింద్ హసరంగా సైతం గాయం కారణంగా తప్పుకోవడంతో సన్ రైజర్స్ జట్టు స్పిన్ విభాగంలో బలహీనంగా కనిపించింది.
జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, వనిందు హసరంగా, ముజీబ్ ఉర్ రెహమాన్, ఆడమ్ జంపా, మార్క్ వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో తక్కువకు అమ్ముడవ్వడంతో ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. వ్యక్తిగత కారణాలు, గాయాలు వంక చెప్పి ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. దీనిపై ఫ్రాంచైజీలు సంతోషంగా లేరు. ఈ సారి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరగనుంది. ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లు మాత్రమే ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవాల్సి ఉంది. మిగిలిన ప్లేయర్లలందరూ వేలంలోకి రానున్నారు.
Do you agree with this recommendation from IPL's franchises? 🤔
— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2024
More details 👉 https://t.co/Zx65yWhHsa #IPL2025 pic.twitter.com/wTxMlofSTK