బీసీసీఐ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ఖాళీ..!

బీసీసీఐ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ఖాళీ..!

ముంబై: బీసీసీఐ సెక్రటరీగా కొత్త వారిని తీసుకోకముందే మరో పోస్ట్‌‌‌‌‌‌‌‌ కూడా ఖాళీ కాబోతున్నది. ఇన్నాళ్లూ బోర్డు ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా పని చేసిన బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌ ఆశీష్‌‌‌‌‌‌‌‌ శీలార్‌‌‌‌‌‌‌‌.. మహారాష్ట్ర గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో క్యాబినెట్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు తీసుకున్నారు. 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన ఆశీష్‌‌‌‌‌‌‌‌.. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఏదో ఒక్క పోస్ట్‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగాలి. మినిస్టర్‌‌‌‌‌‌‌‌, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వెంట్స్‌‌‌‌‌‌‌‌ బోర్డులో సభ్యులుగా ఉండరాదని గతంలో సుప్రీం కోర్టు క్లియర్‌‌‌‌‌‌‌‌గా వెల్లడించింది. అయితే బీసీసీఐ రాజ్యాంగానికి కాస్త మార్పులు చేసిన కోర్టు ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఏలుగా గెలిచిన సభ్యులు ఆఫీస్‌‌‌‌‌‌‌‌ బేరర్స్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించొచ్చని చెప్పింది. మరోవైపు జాయింట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ దేవజిత్‌‌‌‌‌‌‌‌ సైకియా.. బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది.