ఒక వైపు వరల్డ్ కప్ హడావుడిలో ఉండగానే అప్పుడే బీసీసీఐ మరో గుడ్ న్యూస్ ను క్రికెట్ ఫ్యాన్ కు అందించింది. దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ టోర్నీ పూర్తి వివరాలను ప్రకటించేసింది. వస్తున్న సమాచార ప్రకారం 2024 ఐపీఎల్ దుబాయ్ వేదికగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2020 లో తొలిసారి ఈ టోర్నీని యూఏఈ వేదికగా జరిపిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఈ టోర్నీని నిర్వహించగా మరోసారి ఆతిధ్యమివ్వడానికి సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా ఐపీఎల్ వేలం తొలిసారి విదేశాలలో జరగబోతుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లు భారత్ లోనే వేలం నిర్వహించారు. డిసెంబర్ 19న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరగనుందని ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. ఇక ఆటగాళ్లను వేలానికి ఉంచేందుకు వీలుగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్స్ చిన్న మార్పు చేసింది. గత సీజన్ లో మొత్తం రూ.95 కోట్లు ఉండగా..ఈ సారి మరో 5 కోట్ల రూపాయలను పెంచింది. దీని ప్రకారం ఈ సారి వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ 100 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేయొచ్చు అనేది.. రిలీజ్ చేసిన ఆటగాళ్లు, ఐపీఎల్ 2023 వేలం తర్వాత ఫ్రాంచైజీల దగ్గర మిగిలిన మొత్తంపైన ఆధారపడి ఉంటుంది.కమ్మిన్స్, హెడ్, హేల్స్, బిల్లింగ్స్, కోయట్జ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ సారి వేలానికి అందుబాటులోకి రానున్నారు.