మా దేశానికి రాకపోతే..రాతపూర్వకంగా చెప్పాలె

మా దేశానికి రాకపోతే..రాతపూర్వకంగా చెప్పాలె
  •     చాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐకి పీసీబీ షరతు! 

కరాబీ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌‌‌‌ ఆతిథ్యం ఇవ్వనున్న చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో టీమిండియా పోటీపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ట్రోఫీ కోసం ఇండియా తమ దేశానికి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే అందుకు రాత పూర్వక రుజువు చూపాలని బీసీసీఐని పాక్‌‌‌‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరుతుందని ఆ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి–మార్చిలో జరిగే ఈ టోర్నీలో పాల్గొంటుందా? లేదా? అనే విషయాన్ని కూడా త్వరగా తేల్చాలని పీసీబీ కోరుతోంది.

ALSO READ : 16వ సారి కోపా అమెరికా విజేతగా అర్జెంటీనా

‘కేంద్రం అనుమతిని నిరాకరిస్తే అది రాతపూర్వకంగా ఉండాలి. ఆ లెటర్‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ.. ఐసీసీకి తప్పనిసరిగా అందించాలి. టోర్నీ ప్రారంభానికి కనీసం ఐదారు నెలల ముందుగానే పాక్‌‌‌‌ పర్యటనకు సంబంధించిన వివరాలను బీసీసీఐ రాతపూర్వకంగా ఐసీసీకి తెలియజేయాలని మేం పట్టుబడతాం’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.