బీసీలు రాజకీయ వివక్ష ఎదుర్కొంటున్నరు

బీసీలు రాజకీయ వివక్ష ఎదుర్కొంటున్నరు
  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌‌

పాలమూరు, వెలుగు : ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో మెజార్టీగా ఉన్న బీసీలు రాజకీయంగా తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోనెల శ్రీనివాస్‌‌ నేతృత్వంలో ఆదివారం మహబూబ్‌‌నగర్‌‌లోని పద్మశాలీభవన్‌‌లో నిర్వహించిన రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలు, ప్రజా విప్లవాలకు నిలయమైన మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కేంద్రంగా బీసీ రాజ్యాధికార ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఆత్మగౌరవం కోసమే బీసీలు రాజ్యాధికార బాట పట్టారన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని ప్రకటించారు. అగ్రకులాల వారు బీసీల వ్యాపార, రాజకీయ అవకాశాలను హరిస్తున్నారని విమర్శించారు. ఇంటికి ఒకరు కలిసి వస్తే రాజ్యాధికారాన్ని బహుమతిగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో సోషల్‌‌ జస్టిస్‌‌ జేఏసీ చైర్మన్‌‌ వీజీఆర్‌‌ నారగోని, బహుజన ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసు రాంనాయక్‌‌, రాష్ట్ర మహిళా నాయకురాలు అక్కల రమా సాయిబాబా, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భారత మురళీధర్, యూత్ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ మడత కిశోర్‌‌, పీసీసీ ముఖ్య కార్యదర్శి సంజీవ్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.