బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు పతనం తప్పదు

  • జాజుల శ్రీనివాస్​ గౌడ్

ఖైరతాబాద్​, వెలుగు: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టిక్కెట్లు ఇవ్వని రాజకీయ పార్టీలకు పతనం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల పాత్ర అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే , ఎంపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల పేరుతో అగ్రకులాలకు  టికెట్లు ఇచ్చిన రాజకీయ పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  మళ్లీ వారికే టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బీసీలను విస్మరించిన పార్టీలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. సమావేశం లో  కుందారం గణేశ్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్,  తాటికొండ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .