వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం: పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ఆయా సంఘాల నుంచి అభిప్రాయాలు తీసు కుంటున్నామని కాంగ్రెస్ ​నేత, ఓబీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్​ పొన్నం ప్రభా కర్​అన్నారు. బీసీ సంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుం టామని ఆయన హామీ ఇచ్చారు. ఓబీసీ డిక్లరేషన్​లో పొందుపరచాల్సిన అంశాలపై బుధవారం సెంట్రల్​ కోర్ట్​ హోటల్​లో రౌండ్​ టేబుల్​ సమావేశాన్ని నిర్వహించారు.

ALSO READ: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో .. మరోసారి అప్రూవర్​గా రామచంద్ర పిళ్లై?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కచ్చితంగా బీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని పొన్నం గుర్తు చేశారు. ఆ హామీని నెరవేరుస్తామ న్నారు. బలహీనవర్గాలకు అవకాశాలను కల్పించింది ఒక్క కాంగ్రెస్​ పార్టీనే అన్నారు. విద్య, ఉద్యోగాల కల్పన చేసిన ఘనత కాంగ్రెస్​పార్టీదేనని చెప్పారు. ఈ సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, కత్తి వెంకటస్వామి, బీసీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.