బీసీలు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి : ఆర్. కృష్ణయ్య

బీసీలు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి : ఆర్. కృష్ణయ్య
  •     బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: తమ వాటా కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి బీసీలు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. దీనికి ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. " దేశవ్యాప్తంగా ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి.

బీసీ క్రీమీలేయర్ ను ఎత్తివేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందనడానికి 76ఏండల్లో  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీసీ కాకపోవడమేపో నిదర్శనం. బీసీ సమస్యలు పరిష్కరిస్తే అంబేద్కర్ లాగా దేశవ్యాప్తంగా మోదీ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం" అని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ ఓబీసీ ఎంప్లాయిస్ సంఘం గుర్తింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సంఘం నాయకులను కృష్ణయ్య కోరారు. అసోసియేషన్ తెలంగాణ సర్కిల్ అధ్యక్షుడు కే అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సర్కిల్ సెక్రటరీ ఎస్. శివ కృష్ణ, అసోసియేషన్ నేతలు ధర్మరాజు, విజయ్ కుమార్, కె సురేశ్, నరేశ్ తోపాటు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.