BDLలో ఉద్యోగాలు : ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం లక్షల్లో.. టైం లేదు త్వరపడండి..!

BDLలో ఉద్యోగాలు : ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం లక్షల్లో.. టైం లేదు త్వరపడండి..!

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్​ మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీకి హైదరాబాద్​లోని భారత్ ​డైనమిక్స్ లిమిటెడ్​అప్లికేషన్లను కోరుతున్నది. ఈ నెల 21 వరకు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు (49): సైబర్​ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, బిజినెస్ డెవలప్ మెంట్, లీగల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్, అఫీషియల్​ లాంగ్వేజ్ విభాగాల్లో మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి కనిష్టంగా 27 ఏండ్లు, గరిష్టంగా 50 ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ర్టానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్​సైన్స్, సైబర్​ సెక్యూరిటీ, కెమికల్, సివిల్), ఎంబీఏ (ఫైనాన్స్, హెచ్​ఆర్, పబ్లిక్​ రిలేషన్, బిజినెస్ డెవలప్​మెంట్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్​ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

జీతం: డీజీఎం పోస్టుకు నెలకు రూ.80,000– రూ.2,20,000, ఎస్ఎం పోస్టుకు రూ.70,000– రూ.2,00,000, మేనేజ్​మెంట్​ ట్రైనీ, ఏఎస్ లీగల్​ పోస్టులకు రూ.40,000–1,40,000.

సెలెక్షన్: రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ​

ALSO READ | Jobs: సీబీఐలో క్రెడిట్​ ఆఫీసర్ పోస్టులు