
ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వివిధ బీడీఎల్ యూనిట్లలో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు (ఫైనాన్స్)/ వెల్ఫేర్ ఆఫీసర్/ జేఎం పోస్టులకు 28 సంవత్సరాలు; ఇతర ఖాళీలకు 27 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష డిసెంబర్ 2023/ జనవరి 2024 లో నిర్వహించనున్నారు. వివరాలకు www.bdl-india.in వెబ్సైట్లో సంప్రదించాలి.