వానలపై అలర్ట్‌‌గా ఉండండి..ఆఫీసర్లకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలు

వానలపై అలర్ట్‌‌గా ఉండండి..ఆఫీసర్లకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌‌ జిల్లాల్లో శనివారం కూడా ఈదురుగాలులు, వానలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా,ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

 సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని చీఫ్‌‌ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు. దీంతో ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వర్షాల వల్ల కలిగే నష్టాలపై రిపోర్ట్‌‌ను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.