సైబర్ నేరాలకు మెయిల్స్ ద్వారా హ్యకింగే ప్రధాన మార్గం
స్పామ్ మెయిల్స్ సాయంతో మొబైల్, కంప్యూటర్ల హ్యకింగ్
బ్లాక్ మెయిల్ చేసి డబ్బు మాయం, లైంగిక వేధింపులు..
ఇటీవల సైబర్ నేరాలు బాగాపెరిగిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు హ్యాక్ చేసి డేటా దొంగిలించేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దాని సాయంతో బ్యాంకులో డబ్బు మాయం చేస్తున్నారు. పర్సనల్ విషయాలను పట్టుకుని బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. ఎవరైనా అశ్లీల వీడియోలు, న్యూడ్ ఫొటోలు వంటి ఫోన్లు, కంప్యూటర్లలో పెట్టుకుని ఉంటే వాటి అడ్డం పెట్టుకుని లైంగికంగా కూడా వేధిస్తూ.. శారీరకంగా వాడుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలాంటి పర్సనల్ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లడానికి మొబైల్ యాప్స్ ఒక మార్గమైతే… ఇంకా సులభంగా ఈ బ్లాక్ మెయిల్ కు అస్కారం ఇస్తున్న మరో మార్గం మన ఈ-మెయిల్స్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Read also: డేంజర్.. మీ మొబైల్ లో ఈ 29 యాప్స్ వెంటనే తీసేయండి
అన్ నోన్ (స్పామ్) మెయిల్స్ వరద
స్టూడెంట్స్, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఎవరైనా సరే ఈ-మెయిల్ ఐడీ లేనివారంటూ ఉండని రోజులివి. మనం సబ్ స్క్రైబ్ చేయకపోయినా ఏవేవో ప్రమోషనల్ మెయిల్ వస్తూనే ఉంటాయి నిత్యం. వాటిలో కొన్ని మనం ఓపెన్ కూడా చేయం. కానీ అలా గుర్తు తెలియని వారి నుంచి వచ్చే మెయిల్స్ లో ఏదో ఆఫర్ అన్నారనో.. ఇంకేదో ఫిషీగా అనిపించిందనో కొన్నిసార్లు ఓపెన్ చేసేస్తాం. అలా క్లిక్ చేయడమే మన కొంప ముంచుతుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ మెయిల్స్ మనతో ఓపెన్ చేయించి వాళ్ల ట్రాప్ లోకి తీసుకోవడానికి ముందుగా మన మెయిల్ పాస్ వర్డ్ నే పంపుతారని, ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎలా సాధ్యం?
హ్యాకర్లు ఒక స్పామ్ బోట్ ను క్రియేట్ చేసి, దాని సాయంతో కోట్లాది ఈ-మెయిల్ ఐడీల డేటా బేస్ ను సంపాదిస్తారు. హ్యకింగ్ టెక్నిక్స్ ద్వారా పాస్ వార్డ్స్ కూడా వాళ్ల చేతిలో పెట్టుకుంటారు (అందుకే తరచూ మెయిల్ పాస్ వర్డ్స్ మార్చడం మంచిది). వాటిలో కొన్నింటికి టకాటకా స్పామ్ మెయిల్స్ పంపేస్తారు. అలా వచ్చిన మెయిల్స్ మనం ఓపెన్ చేసామంటే చాలు.. ఇక మన స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లోని డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ మెయిల్స్ మనతో ఓపెన్ చేయించడానికి వాటి ‘సబ్జెక్ట్’ ద్వారానే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మెయిల్ వచ్చినప్పుడు ముందుగా ఓపెన్ చేయకుండా కనిపించేది అదే. సో, ఈ 40 రకాల ‘సబ్జెక్ట్’తో మెయిల్స్ వస్తే పొరబాటున కూడా ఓపెన్ చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త!!
ఆ లిస్ట్ ఇదే..
- You better read this
- I infected your PC
- I know everything
- You got owned
- Don’t wait too long
- Your privacy
- No longer private
- Better read
- You got recorded
- Pay
- Infected your computer
- I know your password
- You better pay me
- Your password
- I give you one chance
- Safe your privacy
- Better pay me
- Read carefully
- Your life can be ruined
- You got infected
- I seen everything
- Few days time
- I won’t wait too long
- Video of you
- I recorded you
- Take care
- Your private data
- Take care next time
- I hacked you
- Everyone will know
- You got hacked
- I can ruin your life
- Stop watching porn
- You better pay me
- Read
- Dirty pervert
- I can ruin your life
- Safe your life
- Videos of you
- You dirty pervert