అన్నోన్ యాప్స్ తో.. ఆగమైతున్నరు
లింక్స్ ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ
షాపింగ్, ఫుడ్, లోన్స్ కోసం సెర్చ్ చేస్తున్న యూత్
లాక్ డౌన్ తర్వాత పెరుగుతున్న సైబర్ కేసులు
సేఫ్టీ మస్ట్ అంటున్న పోలీసులు
హైదరాబాద్,వెలుగు: లాక్‌డౌన్ లో టైమ్ పాస్ కోసం ఆడిన మొబైల్ గేమ్స్ లింక్స్ ఆగం చేస్తున్నాయి. ఫోనుకు వచ్చిన లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్స్ లోని డబ్బులు ఖల్లాస్ అవుతున్నాయి. స్మార్ట్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్ వచ్చి సైబర్ క్రిమినల్స్‌కి రూట్ క్లియర్ అయ్యాయి. అన్నోన్యాప్స్ ట్రాప్‌లో యూత్ చిక్కి కష్టాలు కొని తెచ్చుకుంటుంది. షాపింగ్, ఫుడ్, మనీ అవసరాల కోసం అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకు టార్గెట్అవుతున్నారు. ఆన్‌లైన్ అప్పుల యాప్స్‌లో చిక్కిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సుమారు 30 శాతం సైబర్ క్రైమ్స్పెరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువ మంది ఆన్‌లైన్ గేమ్స్‌కి పై ఇంట్రస్ట్ చూపినట్టు కేస్ స్టడీస్ చెప్తున్నాయి. టైమ్‌పాస్ కోసం ప్లే చేసిన గేమ్స్ ఇప్పుడు అకౌంట్స్ ఖాళీ చేయిస్తున్నాయి. నెటిజన్లు అన్నోన్యాప్స్, యూఆర్‌ఎల్ లింక్స్ క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారుతున్నారు. క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వ్యూవర్‌ను ఇన్‌స్టాల్ చేయిస్తూ సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీలు లేకుండానే అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్స్‌పేరుతో అందినకాడికి దోచేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో శుక్రవారం వరకు 3,146 సైబర్ క్రైమ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అత్యధికంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 2,386 కేసులు ఫైల్‌చేశారు.
మైక్రో లోన్ యాప్స్ లో చిక్కి..
మైక్రో లోన్ యాప్స్ లో ఈజీ లోన్ ప్రాసెస్ కోసం చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. యాప్స్‌లో తీసుకున్న అప్పుకు 40 శాతం అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో మరింతగా అప్పులు చేస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత పెరిగిపోయిన పర్సనల్ లోన్‌యాప్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజు సైబర్ క్రైమ్ పోలీసులకు 2 నుంచి 5 కంప్లయింట్లు అందుతున్నాయి. సిటీ కమిషనరేట్ పరిధిలో పది రోజుల్లో 53 కంప్లయింట్లు వచ్చాయి. వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి మరి వేధిస్తున్నారని బాధితులు పోలీసుల ముందు వాపోతున్నారు. సూసైడ్లకు కూడా యత్నించిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ఇస్తున్నారు.
ట్రాప్‌లో వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ గ్యాంగ్స్
వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ గ్యాంగ్స్ యువతను ట్రాప్ చేస్తున్నాయి. అందమైన యువతుల ఫొటోలను డీపీలుగా పెట్టుకొని ఫేస్‌బుక్, వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ ట్రాప్‌లో పడగానే బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయి. ఈ గ్యాంగ్స్ డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాయి. ఇలా రెండు నెల్లలో వీరి ట్రాప్‌లో పడిన ఐదుగురు యువకులు రూ.8.5 లక్షలు పోగొట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ గ్యాంగ్స్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే కొందరు ట్రాప్‌లో చిక్కినా పరువు పోతుందనే భయంతో పోలీసులకు కంప్లయింట్లు ఇవ్వడం లేదు.
బాధితులు కంప్లయింట్ చేయాలి
లాక్‌డౌన్ తర్వాత సైబర్ క్రైమ్స్పెరుగుతున్నాయి. యూఆర్‌ఎల్ లింక్స్ చేంజ్ చేస్తూ వాట్సాప్, ఇన్‌స్ట్రా లింక్స్‌తో సర్క్యులేట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వెస్ట్‌బెంగాల్, రాజస్థాన్ గ్యాంగ్స్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాయి. ట్రాప్‌లో చిక్కిన వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నాయి. ఇలాంటి వారి బారిన పడి రూ.లక్షల్లో మోసపోతున్నారు. బాధితులు ధైర్యంగా వచ్చి కంప్లయింట్ చేయాలి.
-కేవీఎం ప్రసాద్,ఏసీపీ,సిటీ సైబర్ క్రైమ్
తెలియని లింక్స్ వస్తే క్లిక్ చేయొద్దు
సైబర్ క్రిమినల్స్డార్క్ నెట్‌లో మొబైల్ ఫోన్ నంబర్స్ కొనుగోలు చేస్తున్నారు. బ్యాం క్స్, ఫైనాన్స్, గిఫ్ట్స్, జీరో ఇంట్రెస్ట్ లోన్స్ పేరుతో లింక్స్ పంపిస్తున్నారు. కేవైసీ పేరుతో క్విక్ సపోర్ట్ యాప్ లింక్స్ పంపిస్తున్నారు. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది. కీ ప్యాడ్‌తో పాటు స్క్రీన్‌పై చేసే ప్రతి ఆపరేషన్ సైబర్ క్రిమినల్స్ ట్రాప్ చేస్తారు. మొబైల్‌కు గుర్తు తెలియని లింక్స్ వస్తే క్లిక్ చేయ కూడదు.
– అనిల్ రాచమల్ల, సైబర్ ఎక్స్ పర్ట్
మోసపోకుండా ఇవి ఫాలో కావాలి
– బల్క్ మెసే జెస్ పై అలర్ట్‌గా ఉండాలి.
– అన్ నోన్ లింక్స్ వస్తే క్లిక్ చేయకూడదు.
– వెబ్ పేజీల్లో ఒరిజినల్, డూప్లికేట్స్ ఏవో గుర్తించాలి.
– ఫేక్ టోల్ ఫ్రీ నంబర్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు.
– ఫేక్ యూఆర్‌ఎల్ లింక్స్‌లో కి వెళ్లొద్దు .
– ఓటీపీ నంబర్స్ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
For More News..