శ్వాస వ్యవస్థతో పాటు జీర్ణ వ్యవస్థపైనా ప్రభావం
లివర్, పొట్ట కణాలను పాడు చేసే ‘సాడ్స్ కొవీ’
వాషింగ్టన్: కరోనాలో ఇంకో రకం వైరస్ కోరలు చాచేందుకు రెడీ అవుతోందా? దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా సైంటిస్టులు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపైనే ప్రభావం చూపిస్తుంటే.. ఈ ఇంకో రకం కరోనా వైరస్ జీర్ణవ్యవస్థపైనా ఎఫెక్ట్ చూపిస్తున్నదని తేల్చారు. గబ్బిలాల నుంచి పందులకు సోకిన వైరస్.. మనుషులకూ అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్‌కరోలినా సైంటిస్టుల స్టడీలో గుర్తించిన ఈ వైరస్‌ను ‘స్వైన్ అక్యూట్ డయేరియా సిండ్రోమ్ కరోనా వైరస్(సాడ్స్కొవీ)’ అని పిలుస్తున్నారు.
ట్రీట్మెంట్ ఉందా?
ప్రస్తుతం కరోనా వైరస్‌కు రెమ్‌డెసివిర్‌ను ఎమర్జెన్సీ యూజ్ కోసం వాడుతున్నారు. సాడ్స్ కొవీకి రెమ్డెసివిర్ చాలా బాగా పనిచేస్తున్నట్టు సైంటిస్టులు తేల్చారు. వైరస్‌ను మందు ఖతం చేసినట్టు గుర్తించారు. ఒకవేళ మనుషులకు వైరస్ వ్యాపిస్తే ఈ మందు వాడొచ్చన్నారు. అయితే, సాడ్స్కొవీలోని మరిన్ని సెల్టైప్లపై మందును టెస్ట్ చేయాల్సి ఉందని సైంటిస్టులు చెప్పారు. పందులను పెంచే వర్కర్లు, పంది మాంసాన్ని ప్రాసెస్ చేసే కంపెనీల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చైనాలో పుట్టిన ఆల్ఫా రకం వైరస్
ఇప్పుడున్న కరోనా వైరస్ బీటా కేటగిరీలోని వైరస్ అయితే.. పందుల్లో గుర్తించిన ఈ సాడ్స్ కొవీ ఆల్ఫా టైప్ వైరస్ అని సైంటిస్టులు చెబుతున్నారు. శ్వాస వ్యవస్థలోని లంగ్స్‌తో పాటు లివర్, కడుపులోని కణాలపైనా దీని ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. చాలా వేగంగా వైరస్ రెప్లికేట్ అవుతున్నట్టు తేల్చారు. వైరస్ ఎక్కువగా పేగుల్లోనే డెవలప్ అవుతున్నట్టు గుర్తించారు. దాని వల్ల డయేరియా (అతిసార), వాంతులు వంటి తీవ్రమైన రోగాలు వేధిస్తాయని చెప్పారు. 2016లోనే ఈ వైరస్‌ను గుర్తించినా ఇప్పటిదాకా మనుషులకు సోకలేదని, ఒకవేళ సోకితే దాని ముప్పు భారీగా ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. చైనాలో గబ్బిలాల్లోని హెచ్‌కేయూ2 కరోనా వైరస్ల నుంచి ఈ సాడ్స్కొవీ పుట్టిందని, వాటి నుంచి పందులకు సోకిందని గుర్తించారు. చైనాలోనే జనానికి వైరస్ వ్యాపిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీకి భారీ నష్టం తప్పదని హెచ్చరించారు.
For More News..
బాత్ రూమ్‌లో కన్నది.. కిటికీలోంచి పారేసింది
కాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ తిరిగివ్వాలి