
తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి ఎండలు. అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉన్నట్లుండీ మేఘాలు కమ్ముకుని.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.
ఇవాళ్టి (ఏప్రిల్ 16) నుంచి రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ సూచించింది. ఒకవైపు తీవ్రమైన ఎండలతో పాటు ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. మిగితా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంళాఖాతంలో ద్రోణి , ఉపరితల చక్రవాత ఆవర్తనం తో రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అధిక ఎండలతో గాలి లో తేమ శాతం పెరిగి, అక్కడక్కడ క్యూమి లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
Also Read:-బాబోయ్.. అఘోరి నిజ స్వరూపం బయటపడింది..
ఇవాళ్టి నుంచి మూడు రోజులు (ఏప్రిల్ 16 నుంచి 18 వరకు) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలోని మూడు రోజుల పాటు కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇవాళ (ఏప్రిల్ 16) వర్షాలు:
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగా రెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇవాళ (ఏప్రిల్ 16) ఎండలు:
అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో అధికంగా ఎండలు ఉంటాయి.
రేపు (ఏప్రిల్ 17) వర్షాలు:
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.