బీకేర్ ఫుల్: ఈ లక్షణాలుంటే కిడ్నీ సమస్యలున్నట్లే..వెంటనే డాక్టర్ను సంప్రదించండి

ఇటీవల కాలంలో కిడ్నీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలో సమస్యలతో చాలామంది మరణాలకు దారితీస్తున్నాయి. మరణాలకు కారణం అవుతున్న ప్రధాన వ్యాధులలో కిడ్నీ సమస్య ఒకటి. భారత్ లో  ప్రతి ఏటా 2.5 లక్షల మంది మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు భారత్ లో 18 నుంచి ఆ పై వయసు వారు 8 శాతం నుంచి 10 శాతం వరకు కిడ్నీ ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాజీ గణాంకాలు చెపుతున్నాయి. 

కిడ్నీ సంబంధిత సమస్యలను ప్రారంభంలోనే గుర్తించకపోవడం, సమస్య తీవ్రమైన తర్వాత వ్యాధి బయటపడటం తో ఈ జబ్బు బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందంటున్నారు డాక్టర్లు. 

కిడ్నీల్లో రాళ్లు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి: దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి(సీకేడీ)కి గురైతే రోగి చాలాకాలం బాధపడాల్సి వస్తుంది. మధుమేహం, హైబీపీ ఉన్నవారిలో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి ఇది. ఈ వ్యాధి ప్రారంభంలో లక్షణాలు కనిపించవు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం కూడా సాధ్యం కాదు. సరైన చికిత్స అందించడం ద్వారా తీవ్రతరం కాకుండా అదుపులో ఉంచుకోవచ్చు. 

ఈ వ్యాధి లక్షణాలు:వికారంగా ఉండడం, వాంతులు, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండ వద్ద వాపు, తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్రలేమి, ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవాలి. 

కిడ్నీలో రాళ్లు వస్తే కనిపించే లక్షణాలు 

మూత్ర పిండాల్లో పేరుకుపోయిన ఉప్పు, స్పటికాలను కిడ్నీల్లో రాళ్లుగా పిలుస్తారు. సాధారణంగా ఒకటి రెండు రాళ్లు ఏర్పడినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించ కపోవచ్చని డాక్టర్లు చెపుతున్నారు. అయితే ఇది క్రమక్రమంగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. నీళ్లు తక్కువగా తాగడం ఊబకాయం, జీవన విధానం, తీసుకుని ఆహారం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. 

లక్షణాలు:మూత్రం చేస్తున్నప్పుడు నొప్పి,మూత్రంలో రక్తం పడటం, మూత్ర నాళంలో ఏదో తట్టినట్లు అనిపించడం, రాయి ఉన్న భాగంలో నొప్పి వంటి లక్షణా లుంటే కిడ్నీలో రాళ్లు వచ్చినట్లే. సో బీకేర్ ఫుల్.