చాటింగ్ తో జర జాగ్రత్త

చాటింగ్ తో జర జాగ్రత్త

మాట్లాడుకునే పరిస్థితి లేనప్పుడు, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, విషయాన్ని చేరవేయడానికి ఎక్కువమంది చాటింగ్‌  ఎంచుకుం టున్నారు.చాటింగ్‌ లో ఒకరు మరొకరితో మాత్రమే కాదు, గ్రూప్‌ ద్వారా ఎంతమందితో అయినా మాట్లా డుకోవచ్చు.

కాదేదీ చాటింగ్‌ కు అనర్హం….

ఆఫీసు వ్యవహారాల నుం చి, ఇంటి విషయాల వరకు అన్నీ చాటింగుల్లోనే పంచుకుంటున్నారు. మాట్లాడే అవకాశం లేకపోతే చాలు తిన్నావా, ఎక్కడున్నావు, ఎట్లా ఉన్నావు, డబ్బులు అందాయా’ లాంటి సాధారణ విషయాలతోపాటు.. ‘సినిమాకు వెళ్దాం, ఫలానా ప్లేస్‌ లో రాత్రికి నైట్‌ పార్టీ ఉంది, గర్ల్‌‌ ఫ్రెండ్‌ తోషాపింగ్‌ కు పోతున్నా..’ లాంటి విషయాలు కూడా చాటింగుల్లో మామూలయ్యాయి. ఆన్‌ లైన్‌ లో అనేక చాటింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి రావడంతో ఎక్కువమంది నేరుగా మాట్లా డుకోవడంకంటే చాటింగ్‌ ద్వారానే మాట్లా డుకుం టున్నారు. వాట్సాప్‌ ,ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌‌ లాంటి చాటింగ్‌ యాప్స్‌ తో బిజీగా ఉంటున్నారు.

నమ్మలేం….

చాటింగ్‌ లో పంపే మెసేజ్‌ ఒక్కరికే చేరుతుంది అనుకుంటే పొరపాటు. సోషల్‌ మీడియాలో పెట్టే మెసేజ్‌ లకు పరిమితి ఉండదు. ఒక్కసారి ఇంటర్నెట్‌ లోని యాప్స్‌ లోకి వెళ్లాక, ఎంతమందికి చేరుతుం దో చెప్పలేం . పోస్ట్‌‌ పెట్టిన తర్వాత డిలీట్‌ చేసినా అది వాళ్ల వరకే తప్ప, అందరి దగ్గర నుం చి పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. ఆన్‌ లైన్‌ చాటింగ్‌ లన్నీ అలాగే ఉంటాయి. వాటిని స్క్రీన్‌ షాట్‌ తీసి అవతలివాళ్లు మరొకరికి పంపొచ్చు. అసలు సోషల్‌ మీడియాలో చాటింగ్‌ కు సంబంధించి ‘ప్రైవేట్‌ , ప్రైవసీ’ అనే పదాలకు తావు లేదు. మాట్లాడిన విషయాలు మర్చిపోవచ్చు. ఆధారాలు ఉండకపోవచ్చు. కానీ చాటింగ్‌ లో పెట్టిన పోస్ట్‌‌లు మాత్రం అలాగే ఉండిపోతాయి. కొన్ని యాప్స్‌ వ్యక్తిగత విషయాలను భద్రంగా ఉంచవు. అలాంటి యాప్‌ ల ద్వారా చాటింగ్‌ చేసిన సమాచారం, ఫొటోలు, కుటుం బ విషయాలు, వ్యక్తిగత కార్యక్రమాలు, ఆర్థిక విషయాలు..తెలియని వాళ్లకూ చేరే ప్రమాదం ఉంది.

ఇలా చేస్తే చాలు…..

…చాలామందికి అదే పనిగా చాటింగ్‌ చేసే అలవాటు ఉంటుం ది. అలా చేయడం మంచిది కాదని తెలిసినా మానలేకపోతుంటారు. అలాంటి వాళ్లు చిన్నచిన్న షరతులు పెట్టు కుంటే సులభంగా మానేయొచ్చు.

…చాటింగ్‌ చేయడం మానేస్తు న్నాను. ఇక ఎవరైనా నాకు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే నేరుగా ఫోన్‌ చేయండని స్నేహితులకు, ఇంట్లో వాళ్లకు చెప్పాలి.

…చాటింగ్‌ కోసం వచ్చే మెసేజ్‌ లకు రిప్లై ఇవ్వడం పూర్తిగా ఆపేయాలి.

…వాట్సాప్‌ , మెసెంజర్‌ … లాంటి చాటింగ్‌ యాప్స్‌‌ను స్మార్ట్‌‌ఫోన్‌ నుంచి తొలగించాలి.

….ఫేస్‌ బుక్‌ , వాట్సాప్‌ లాంటి వాటిని చూసినా, మెసేజ్‌ లు పోస్ట్‌‌ చేయకుండా ఉండాలి.

….చాటింగ్‌ చేయాలని మనసు లాగినప్పుడు, పుస్తకం, టీవి, మొక్కల పెం పకం.. లాంటి వాటి మీదకు ధ్యాస మళ్లిం చాలి.

….ఇష్టమైన అభిరుచి మీదకు మనసు మళ్లిం చడం వల్ల చాటింగ్‌ చేయడం తగ్గించు కోవచ్చు.