-
సేఫ్టీ లేని రూటర్స్‌ను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్,వెలుగు: స్మార్ట్‌ఫోన్స్, డిజిటల్ అకౌంట్లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం పబ్లిక్ ప్లేసెస్‌లోని ఫ్రీ వైఫై, బ్లూటూత్ కనెక్షన్లను టార్గెట్ చేస్తున్నారు. హై టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ డేటాను హ్యాక్ చేసి అకౌంట్స్ ఖాళీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాస్‌వర్డ్ లేకుండానే వైర్‌లెస్ కనెక్షన్లను మాల్‌వేర్ లింక్స్‌తో హ్యాక్ చేసి డేటా చోరీకి పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ తరహా మోసం ఒకటి బయటపడటంతో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పబ్లిక్ ప్లేసెస్‌లోని ఫ్రీ వైఫై, గుర్తు తెలియని బ్లూటూత్‌లను కనెక్ట్ చేసే వారిని అలర్ట్ చేస్తున్నారు. వైర్‌లెస్ యాక్సెస్‌లో జాగ్రత్తలు పాటించకపోతే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా, టూరిస్ట్ స్పాట్లలో అవగాహన కల్పిస్తున్నారు.
సేఫ్టీ లేని సర్వర్లపై అటాక్స్..
రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లతోపాటు చాలా హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై ఉంటుంది. వీటిలో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు అప్‌డేటెడ్ టెక్నాలజీని వాడుతూ.. ఫ్రీ వైఫైతో కనెక్ట్ అవుతున్న వారిని గుర్తిస్తున్నారు. స్నిఫ్ఫింగ్ సాఫ్ట్ వేర్ సాయంతో పబ్లిక్ ప్లేసెస్‌లోని ఈ ఫ్రీ వైఫై రూటర్లపై అటాక్స్ చేస్తున్నారు. దీంతో పాటు సైబర్ నేరగాళ్లు సైతం పబ్లిక్ ప్లేసెస్, టూరిస్ట్ స్పాట్లలో ఓటీపీ, యూజర్ ఐడీ లేకుండా వైఫై కనెక్ట్ చేసుకునేలా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు. ఈ వైఫైను కనెక్ట్ చేసుకున్న వారి స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఫేక్ ప్రొఫైల్‌లో హాట్ స్పాట్లను ఆపరేట్ చేస్తున్నారు. ఎలాంటి పాస్‌వర్డ్ లేకున్నా వైఫై వాడేలా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా ఫ్రీ లేదా పబ్లిక్ వైఫైని ఉపయోగించే సమయాల్లో మొబైల్‌లో సైన్ అప్ సెట్టింగ్ వస్తుంది. ఇందులో ఎస్ బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే వైఫై యాక్సెస్ అవుతుంది.ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్‌లోని యాప్స్ ఆటోమేటిక్‌గా ఆయా సర్వర్‌లో కాపీ అవుతుంటాయి. ఇలాంటిదే సైబర్ నేరగాళ్లు అమర్చే వైఫై ద్వారా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కనెక్టివిటీతో పర్సనల్ డేటా అంతా హ్యాకర్ల చేతికి చేరే ప్రమాదం ఉందని సైబర్ ఎక్స్ ప్టర్స్ చెబుతున్నారు.బ్లూబర్న్, బ్లూ బగ్గింగ్ సాఫ్ట్వేర్లతో..వైఫై తరహాలోనే బ్లూటూత్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నా. మెట్రో సిటీస్‌లోని రైల్వేస్టేషన్లు, కమర్షియల్ ఏరియాలు, పబ్లిక్ ప్లేసెస్‌లో బ్లూటూత్ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. సైబర్ సేఫ్టీ సెట్టింగ్స్ చేసుకోని బ్లూటూత్ డివైజ్‌లపై బ్లూ బర్న్, బ్లూ బగ్గింగ్, బ్లూజాకింగ్, బ్లూ స్నార్పింగ్ సాఫ్ట్వేర్లతో అటాక్స్ చేస్తున్నారు. సుమారు10 మీటర్ల దూరం లోపల యాక్టివ్‌గా ఉన్న బ్లూటూత్ డివైజ్‌ను టార్గెట్ చేసి మాల్‌వేర్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇందుకోసం హ్యాకర్లు తమ డివైజ్‌కు ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండానే యాక్సెస్ ఇస్తారు. ఇలాంటి బ్లూ బగ్గింగ్‌కు కనెక్ట్ అయిన డివైజ్‌ను బ్రూట్ ఫోర్స్ విధానంతో పెయిర్ చేస్తుంటారు. ఆ తర్వాత కోడ్‌ను క్రాక్ చేసి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేస్తారు. మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి మొబైల్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ హెడ్‌సెట్స్‌తోనూ..
సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన స్మార్ట్‌బగ్స్‌తో డేటా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్లూటూత్, వైఫై ద్వారా సులువుగా డివైజ్ బ్లూ-బగ్ చేసేందుకు వీలుంటుందని.. దీంతో స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ స్టీరియో సిస్టమ్,వైర్‌లెస్ ఇయర్ బడ్స్,హెడ్‌ఫోన్స్ కనెక్ట్ అవుతుంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వీటి ద్వారా కూడా స్మార్ట్‌ఫోన్లలోకి మాల్‌వేర్ చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ఇలాంటి డివైజ్‌లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ రావు. వీటిని మ్యాన్ హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది. డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్‌లో బగ్స్ ఉంటే కూడ మాల్‌వేర్‌తో హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వైర్‌లెస్ డివైజ్‌లతో కనెక్ట్ చేసే యాప్‌ల వాడకంపై కూడా యూజర్లు జాగ్రత్తలు పాటించాలని.. మోసపోవద్దని సైబర్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
సేఫ్టీ ప్రికాషన్స్..
- పబ్లిక్ ప్లేసెస్‌లో ఫ్రీ వైఫైను వాడుతున్నప్పుడు ఆన్ లైన్ మనీ ట్రాన్జాక్షన్లు, ఈ–కామర్స్ సైట్లలో షాపింగ్ చేయొద్దు.
- పబ్లిక్ ప్లేసెస్‌లో గుర్తు తెలియని వైఫైని మొబైల్‌కు కనెక్ట్ చేయొద్దు
- బ్లూటూత్ వాడని సమయంలో దాన్ని ఆఫ్ చేయాలి
- లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ ప్యాచ్‌లతో వచ్చే అప్‌డేట్స్ చేసుకోవాలి.
- తెలియని బ్లూటూత్ పెయిరింగ్ రిక్వెస్టును యాక్సెప్ట్ చేయొద్దు.
- వైఫైలో డివైజ్ యూజ్ చేసినప్పుడు రీబూట్, రీస్టార్ట్ చేస్తుండాలి
- వైరస్, మాల్‌వేర్‌ను గుర్తించేందుకు స్కాన్ చేయాలి.
ఫ్రీ వైఫై నెట్ వర్క్‌లో హ్యాకర్లు ఉండొచ్చు
బ్లూటూత్, వైఫై ద్వారా స్టార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలున్నాయి. ఫ్రీ వైఫై ఓపెన్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. దీంతో అందులో హ్యాకర్లు కూడా ఉండొచ్చు. ఈ వైఫై రూట
ర్‌కి కనెక్టయ్యే డివైజ్ ఆధారంగా ఐపీ అడ్రెస్, మ్యాక్ అడ్రెస్ చూడొచ్చు. షేర్ ఫోల్డర్లను కూడా హ్యాకర్లు చూసే అవకాశాలు ఉన్నాయి. ఐపీ అడ్రెస్ చేతికి అందిన తరువాత స్నిఫ్ఫింగ్ అటాక్స్ చేస్తారు. ఇలాంటి నేరగాళ్ల బారినపడకుండా ఉండాలంటే సెక్యూరిటీ ఫీచర్స్ తప్పనిసరిగా పాటించాలి.
– విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్
సర్వర్లే టార్గెట్‌గా మాల్‌వేర్స్
హ్యాకర్లు సర్వర్లనే టార్గెట్ చేస్తుంటారు. బ్యాంక్స్, ఈ కామర్స్ సైట్స్‌పై అటాక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లూటూత్, ఫ్రీ వైఫై ద్వారా కూడా మాల్‌వేర్స్ పంపిస్తున్నట్లు గుర్తించాం. మన దగ్గర ఇలాంటి కేసులు రిపోర్ట్ కాలేదు. కానీ సైబర్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిసి వైర్‌లెస్ డివైజెస్ హ్యాకింగ్స్ నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియా ద్వారా జనాలకు అవగాహన కల్పిస్తున్నాం.
– శ్రీధర్, సైబర్ క్రైమ్ ఏసీపీ, సైబరాబాద్