కషాయంతో బీ కేర్ ఫుల్

కషాయంతో బీ కేర్ ఫుల్

కరోనా భయంతో ఎక్కువగా తీసుకుంటున్న జనం

సిటీలో పెరుగుతున్న అసిడిటీ ఇష్యూస్

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్స్ కు ..

కేసులు మూడింతలు పెరిగాయంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా రాకుం డా ఉండడం కోసమంటూ ఇప్పుడు అనేకమంది కషాయం తాగుతున్నారు. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, శొంఠి వంటివి ఎక్కువ మోతాదులో తీసుకుంటూ అసిడిటీ, గ్యాస్ట్రిరిక్ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. సిటీలో అలా తమను కన్సల్ట్ అవుతున్న వారి సంఖ్య 3 రెట్లు పెరిగినట్లు డాక్టర్లు చెప్తున్నారు. కషాయం తాగితే వెంటనే ఇమ్యూని టీ పవర్ పెరగదని, అతిగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ లో చూసి

కరోనా వైరస్ ఎఫెక్ట్ సిటీ జనంపై ఎక్కువగా ఉంది. ఇంటర్ నెట్, యూట్యూబ్ లో చూసి ఇమ్యూని టీ పవర్ పెంచుకునేందుకు డైట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. డాక్టర్ ని కన్సల్ట్ అవకుండానే కషాయాలు చేసుకుని తాగేస్తున్నారు. టీ, జ్యూస్ లోనూ మిరియాలు యాడ్ చేసుకుంటున్నారు. ఇలా అన్నింటిలోనూ ఘాటుగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో మంట, నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు.

తక్కువ మోతాదు తాగాలి

కషాయం ఆరోగ్యానికి మంచిదే కానీ, అధిక మోతాదులో తాగొద్దు. ఇమ్యూనిటీ కూడా పెరగదు. డైలీ ఓపీలో 10మంది దాకా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవారు కషాయం తాగొద్దు. రెగ్యులర్ తో పోలిస్తే పేషెంట్స్ కౌంట్ పెరిగింది.

డా.భవాని రాజు, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్.