ప్రపంచంలో చైనా తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. ఒకప్పుడు ఫోన్ అంటే కాల్స్ మాట్లాడుకోవటానికి మాత్రమే. కానీ, ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మాత్రం బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్‌తో సహా ప్రతీ ఇన్‌ఫర్మేషన్‌ని దాచుకునే స్టోరేజ్ బ్యాకప్. అంటే ఒక మనిషి స్మార్ట్ ఫోన్ వేరే వాళ్ల చేతిలో పడితే అతని పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవ్వొచ్చు. ఫైనాన్షియల్ డేటా, పర్సనల్ ఫొటోలు, చాట్, కాల్ రికార్డ్ డేటా మొత్తం వేరే వాళ్ల చేతిలోకి ఫోన్‌తో పాటే వెళ్లిపోతాయి.
గేమింగ్, బ్రౌజింగ్, షాపింగ్, ఫుడ్ డెలివరీ, ట్రాన్స్ పోర్ట్ ఇలా ప్రతీ విషయంలో పూర్తిగా మొబైల్ అప్లికేషన్స్ మీదే ఆధార పడుతున్నారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఒకటుంది… ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోగానే మన ఫోన్‌లో ఉన్న డేటా కూడా ఆ యాప్ డెవలపర్ చేతుల్లోకి వెళ్లిపోతే? మన పక్కన ఉన్నవాళ్లకే తెలియకుండా లాక్ వేసుకొని మరీ దాచుకునే మన వివరాలు ఎక్కడో వేరే దేశంలో ఉన్న యాప్ డెవలపర్ హ్యాక్ చేస్తే ఎలా?
జాగ్రత్త అవసరం
2018 లోనే 483 మిలియన్ల మంది మన దేశంలో స్మార్ట్ ఫోన్లు వాడుతుంటే అందులో 390 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేస్తున్నారు. 2023 కల్లా ఇంటర్‌నెట్ యూజర్స్ 500 మిలియన్లు దాటతారని ఒక ఎస్టిమేషన్. ఇలా మొబైల్ ఇంటర్ నెట్ యూజర్స్ ఎంత పెరిగితే అంత ఎక్కువగా సైబర్ నేరగాళ్లకి అవకాశం దొరికినట్టే. అందుకే ఒక యాప్‌ని మొబైల్, టాబ్లెట్ పీసీ లాంటి గాడ్జెట్స్‌లోకి డౌన్‌లోడ్ చేసేముందు కాస్త జాగ్రత్త అవసరం. మరీ ఒక మొబైల్ యాప్‌కి ఇంత భయం అవసరమా? అంటే…. అవును… కచ్చితంగా అవసరమే. ఒక మొబైల్ ఫోన్ డేటా చేతులు మారితే జీవితాలే మారిపోవచ్చు. అందుకే ఈ టెక్నాలజీ టైంలో ఇలాంటివాటి గురించి కొంచెం అవేర్‌నెస్ ఉండాలి.
యాప్స్ ఏం చేస్తాయి?
కొన్ని యాప్స్‌కి బేసిక్ యాక్సెస్ అవసరం పడుతుంది. అయితే ఇక్కడ తీసుకున్న డాటా ఇన్‌ఫర్మేషన్‌ని ఆ యాప్స్ డెవలపర్స్ దగ్గర ఉండే సర్వర్‌లో స్టోర్ చేస్తాయి. అంటే ఎక్కడో వేరే దేశంలో ఉండే ఆ యాప్ డెవలపర్‌కి డాటా చేరిపోతుంది. అక్కడ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తే ‘ఓకే’. కానీ, ఆ సమాచారం లీక్ అయినా, ఆ డెవలపర్ ఎవరికైనా అమ్ముకున్నా ఇక్కడ ఫోన్‌లో యాప్ వాడుతున్న యూజర్ కి ఇబ్బందులు తప్పవు. అందుకే… గ్యారెంటీ లేని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునేముందు, సోషల్ మీడియాలో ‘మీ ఏజ్ చెప్పండి… మీ మనసు చెప్తాం’, ‘మీ కళ్లని దగ్గరగా ఫొటో తీయండి… మీ ఫ్యూచర్ చెప్తాం’ అంటూ వచ్చే యాప్స్‌లోకి వెళ్లకూడదు.
ఎలా తెలుసుకోవాలి?
ఇంటర్నెట్ వాడినా వాడకపోయినా ఫోన్ లో డేటా స్పీడ్‌గా, ఎక్కువగా అయిపోతోందీ అంటే ఆ ఫోన్‌లోకి మాల్‌వేర్, స్పై వేర్ (వైరస్) ఉండొచ్చు. ప్రతీ యాప్ ఎంత డేటా వాడుకుంటుందన్నది సెట్టింగ్స్‌లో చూసుకుంటే తెలిసిపోతుంది. మనం వాడకుండా ఉన్న యాప్ కూడా ఎక్కువ డాటా తీసుకుంటోంది అంటే కచ్చితంగా దాన్ని యూజర్‌కి తెలియకుండా ఎవరో రన్ చేస్తున్నట్టే. అలా ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ యాప్ ని అన్‌ఇన్‌స్టాల్ చేయటం మంచిది. డైరెక్ట్‌గా డిలీట్ చేయకుండా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
మాల్ వేర్, స్పై వేర్ అంటే ఏమిటి?
మాల్ వేర్ అంటే యాప్‌తో పాటు మన మొబైల్లోకి చేరిపోయే కోవర్ట్ లాంటి వైరస్. మన చేతిలో ఉన్న డివైజ్‌ని ఎక్కడో ఉన్న ఎటాకర్ ఆపరేట్ చేసేలా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే…! ఆ మాల్‌వేర్ మన ఫోన్లోకి చేరితే మనకు తెలియకుండానే వేరేవాళ్లకి మెసేజ్‌లు వెళ్లటం, బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయటం. పర్సనల్ డాటాని కాపీ చేసుకొని బ్లాక్ మెయిల్ చేయటం.. ఇలా ఫోన్ మన చేతిలో ఉండగానే ఏదైనా చెయ్యొచ్చు. స్పై వేర్ కూడా అలాంటిదే ఇది ఒక దొంగ లాంటి సాఫ్ట్‌వేర్. ఫోన్‌లోని ప్రైవేట్ డాటాను దొంగిలిస్తుంది. ఫోన్ కాల్ హిస్టరీ, మెసేజ్‌లు, లొకేషన్, బ్రౌజర్ హిస్టరీ, కాంటాక్ట్ లిస్ట్, ఈ– మెయిల్ ఇలా ప్రతీ దాన్ని కాపీ చేసి దొంగిలిస్తుంది.
యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు
మొబైల్‌లో ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు కొంత డాటాని యాక్సెస్ చేయటానికి పర్మిషన్ అడుగుతుంది. ఇలా అడుగుతున్నప్పుడు కచ్చితంగా దాన్ని పూర్తిగా చదివాకే యాక్సెప్ట్ చేయాలి. చాలా యాప్స్ డేటా, ఫంక్షన్స్ యాక్సెస్ అడుగుతాయి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యాప్స్‌కి మాత్రం ఆ డాటా అవసరమే సోషల్ మీడియా యాప్ అయితే ఆ ఫోన్‌లోని ఫొటోలు, గూగుల్ మ్యాప్స్ అయితే ఏరియా లొకేషన్, క్లైమేట్ రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి వాటికి యాక్సెస్ ఇవ్వాల్సిందే. చాటింగ్ యాప్‌కి కాంటాక్ట్ లిస్ట్ అవసరం. ఇవి ఆ డాటాని యాక్సెస్ చేయటానికి పర్మిషన్ అడుగుతాయి. కానీ, ఒక గేమింగ్ యాప్ కాల్ లిస్ట్, ఫొటోలు, ఫైల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు కూడా యాక్సెస్ చేయటానికి పర్మిషన్ అడిగితే మాత్రం ఒక్క సారి ఆలోచించాల్సిందే. గేమ్ ఆడటానికి యూజర్ తన డాటా మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓలా, ఊబర్ లాంటి యాప్స్ లొకేషన్ ట్రాకింగ్ కోసం లొకేషన్ యాక్సెస్ అవసరం. కానీ అలాంటి యాప్ మన మెసేజ్‌లు, ఫొటోలని కూడా యాక్సెస్ చేయటానికి యాక్సెప్ట్ అడుగుతోంది అంటే అనుమానించాల్సిందే.
ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ వైఫై వాడొద్దు
ఫ్రీ వైఫై అనగానే డాటా సేవ్ చేసుకోవటానికి వెంటనే కనెక్ట్ చేసుకునే అలవాటు మానుకోవాలి. ఫ్రీ వైఫై అనేది ఒక గాలం లాంటిది.. స్మార్ట్ ఫోన్‌లోకి హ్యాకర్ మాల్ వేర్ రావటానికి గేట్లు బార్లా తీసినట్టే.
అలాగే వైఫై కనెక్ట్ చేసి బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అస్సలే చేయొద్దు. మరీ తప్పనిసరిగా వాడుకోవాల్సి వస్తే ఎలా? అనుకుంటే ఫోన్ లో యాంటీ వైరస్, మాల్‌వేర్‌లని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఉంచుకోవాలి. గేమింగ్, చాటింగ్,
సినిమాల డౌన్‌లోడ్ అంటూ ఫ్రీ వైఫై కోసం వెతికితే మొదటికే మోసం వస్తుంది.
మొబైల్ యాప్స్‌తో మరింత జాగ్రత్త…
- టెక్నాలజి
- December 28, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బాల్యవివాహాలు సామాజిక దురాచారం : తహసీల్దారు మాలతి
- హీయో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
- రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా... ఎక్కడంటే...
- చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి
- రైతుల ఖాతాల్లో రూ.30.20 కోట్ల బోనస్ జమ
- ప్రధానిని కలిసిన ప్రజాప్రతినిధులు
- ప్రతి నియోజకవర్గానికి 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : నాగుల సత్యనారాయణ గౌడ్
- Dhanush Aishwarya Rajinikanth: 20 ఏళ్ల బంధానికి తెర.. ధనుష్, ఐశ్వర్యకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
- ఆధ్యాత్మికం: సమస్యలను.. ఇబ్బందుల వచ్చినప్పుడు ఎలా ఉండాలి..
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?