దేశం కోసం ఏ క్షణమైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలని విశాక ఇండస్ట్రీస్ ఎండీ & హైదరాబాద్ అంబేద్కర్ కళాశాల కరస్పాండెంట్ సరోజ అన్నారు. కరీంనగర్ జ్యోతి నగర్ వివేకానంద విగ్రహం వద్ద ఆర్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణ వినోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి హోదాలో గడ్డం సరోజన హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో నేడు నిజాం విముక్త స్వాతంత్ర్య దినోత్సవమని, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం చాలామంది ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఈ ఉద్యమంలో ముస్లింలు, హిందువులు పాల్గొన్నారన్న ఆమె... బ్రిటిష్ హయాంలో విభజించి పాలించారని చెప్పారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ తెలంగాణ విముక్తి కోసం ఆర్మీ ని పిలిపించి పోరాటం చేశారని, వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. భావితరం పిల్లలకు దేశం స్వాతంత్ర్యం గురించి తెలియజేయాలన్న సరోజ... ఈ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.