![లెటర్ టు ఎడిటర్ : సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలి](https://static.v6velugu.com/uploads/2025/02/be-responsible-on-social-media-letter-to-editor-story-of-y-sanjeeva-kumar_1Ipe87OaCs.jpg)
వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల్లో వివిధరకాల పోస్టులు, వీడియోలు వస్తుంటాయి. ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు సహకరించండి... ఈ పిల్లలు తప్పిపోయారు వాళ్ళ తల్లిదండ్రుల వద్దకి చేరేవరకు పోస్టింగ్ చేయండి... సర్టిఫికెట్లు పోయాయి.. వాళ్ళకి తెలిసేవరకు అందరికి పంపండి...యాక్సిడెంట్ అయింది అందరికి తెలపండి... వివిధ మతాల దేవుళ్ళ ఫొటోలు పంపి ఇది అందరికి పంపితే మంచి జరుగుతుంది అని ఇలా ఎన్నో ఎన్నెన్నో రకాల పోస్ట్స్ చేస్తుంటారు.
కానీ, పోస్ట్స్ చేసేటప్పుడు అది నిజంగా ఇపుడే జరిగిందా, ఎప్పుడు జరిగిందో గమనించాలి. మీరు పంపించే పోస్టులపైన తేదీ, సమయం వేయండి, అప్పుడు అది ఎప్పుడు పోస్ట్ చేసిందో అందరికి తెలుస్తుంది. మరికొన్ని వీడియోలు, ఫొటోస్ ఇతరులను రెచ్చగొట్టేలా పెడుతున్నారు, ఆయా వర్గాల మధ్య వివాదాలు కొనసాగితే భారతదేశం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. మరికొందరు చేసే ప్రచారం చాలామంది జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి.
సామాజిక బాధ్యతతో ఆలోచించి సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి. మీ ఆలోచనలు, ప్రవర్తన బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు చెప్పే విషయాలు, మీరు చేసే పనులలో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే మంచి ఉండాలి. నేడు సోషల్ మీడియా పవర్ఫుల్ ఆయుధంగా మారింది. మరి అలాంటి సోషల్ మీడియాలో అనవసరమైన పోస్ట్స్ పంపడం వల్ల సోషల్ మీడియా నమ్మలేని విధంగా తయారవుతోంది. పరిస్థితులు ఇలానే దిగజారితే పూర్తిగా సోషల్ మీడియా నమ్మకాన్ని కోల్పోతుంది. సోషల్ మీడియాను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉన్నది.
- వై.సంజీవ కుమార్-