భారీ వర్షా లే కాదు... చిన్నచిన్న తుంపర్లు పడుతున్నా... ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగే నీటి దగ్గరి నుంచి... అన్నింట్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే... ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం.
సమస్యలు...
వర్షాలు పడినప్పుడు ఇంటి పరిసర ప్రాంతాల్లో అంటే గుంతల్లో, రోడ్ల మీద, బయట పాత సామాన్లలో నీళ్లు నిలుస్తాయి. అలాంటి చోట దోమలు ఎక్కువగా చేరి... వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది. • అలాగే ఈ కాలంలో ఎగ్జిమా, యాక్నె, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు...
• వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ.. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. • స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు... ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు బయట తినడం మానేయాలి. అంతేకాదు... బయట కొన్న పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగాకే తినాలి.
• దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నుంచి రక్షించుకోవాలంటే రోజూ చేతులు, కాళ్లకు ఇన్సెక్ట్ రెపెల్లెంట్ రాసుకోవాలి. అలాగే యాంటీ మలేరియా మందులను కూడా తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు మురికి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లకపోవడం మేలు.
• వానలో తడిస్తే ఇంటికి రాగానే... తడిగా ఉన్న బట్టలు, సాక్స్ ని విడవాలి. కాళ్లను నీళ్లతో కడిగి తుదుచుకోవాలి.
• వర్షంలో తడిచాక స్నానం చేయడం తప్పనిసరి.
• మార్కెట్ లో దొరికే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుని వాడాలి. అలా చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
• శరీరాన్ని వెచ్చగా, పొడిగా ఉంచుకుంటే... జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.
• ఏసీ ఉన్న రూముల్లోకి తడి జుట్టు, దుస్తులతో వెళ్లొద్దు.
• ఈ కాలంలో ఎప్పుడూ కాస్తంత వదులుగా
ఉన్న కాటన్ దుస్తులే వేసుకోవాలి. వీలైనంత వరకు సింథటిక్ ఫైబర్కు దూరంగా ఉండాలి.
• చర్మంపై చెమట, తేమ పేరుకుపోకుండా యాంటీ ఫంగల్ పౌడర్ను వాడాలి. ఏదైనా ఇన్ ఫెక్షన్తో బాధపడుతున్నట్లైతే.... డాక్టర్ల సలహా మేరకు మెడికల్ పౌడర్లను
ఉపయోగించాలి.
• ఆస్తమా, డయాబెటిస్ బాధితులు... చినుకులు పడుతున్న కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. • క్రమం తప్పకుండా రెగ్యులర్ వాడే మందులతో పాటు వ్యాక్సినేషన్
తీసుకోవాలి.
• మామూలు టీ కంటే హెర్బల్ టీ తాగడం మంచిది. అలాగే వేడి చేసి, చల్లార్చిన నీళ్లన తాగాలి.
• విటమిన్-సి ఉన్న కూరగాయలు, పండ్లను తరచూ తీసుకోవాలి. అవి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. • పిల్లల చర్మం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మృదువుగా, సున్నితంగా ఉండే పిల్లల చర్మానికి డాక్టర్ల పర్యవేక్షణలో
మాయిశ్చరైజర్ వాడాలి.