
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. నాగారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఎలుగు బంటి వారిని తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంటి గ్రామంలోకి చొరబడటాన్ని గమనించిన గ్రామస్తులు.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.