ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఉల్లంపల్లి రోడ్డు వద్ద బొమ్మనపల్లికి చెందిన కత్తుల బాలయ్య అనే రైతు తన పొలం వద్దకు వెళ్తుండగా ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటనలో అతని చేతికి గాయమైంది. గాయపడిన బాలయ్యను చికిత్స కోసం హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.