హైదరాబాద్‎లో మొదలైన బేర్ హౌస్ స్టోర్

హైదరాబాద్‎లో మొదలైన బేర్ హౌస్ స్టోర్

హైదరాబాద్, వెలుగు: మగవాళ్ల దుస్తులు అమ్మే ది బేర్ హౌస్ హైదరాబాద్‌‌‌‌ బంజారా హిల్స్‌‌‌‌లో ఆఫ్‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ బ్రాండ్ మొట్టమొదటి హై స్ట్రీట్-కమ్ మాల్ రిటైల్ ఔట్​లెట్. దీనిని 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ బేర్ హౌస్ సిగ్నేచర్ బేర్ కేవ్ డిజైన్‌‌‌‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్టోర్‌‌‌‌లో ది బేర్ హౌస్ ప్రీమియం, స్మార్ట్- క్యాజువల్ కలెక్షన్​ కూడా ఉంటాయి.