చెట్టుపై ఎలుగుబంటి హల్ చల్.. భయాందోళన గ్రామస్థులు

 మద్య చిరుత పులులు, పాములు, ఎలుగుబంట్లు, గ్రామాల్లో తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి.  మనుషులు,జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా  కరీంనగర్  జిల్లా మానుకొండూరు మండల కేంద్రంలో ఎలుగుబంటి  హల్ చల్ చేసింది.  

చెట్టుపైకి ఎక్కి తిష్ట వేసింది ఎలుగుబంటి. చాలా సేపు చెట్టుపైనే ఉండటంతో  ఎలుగుబంటిని  చూసేందుకు ప్రజలు చుట్టుముట్టారు.   ఇవాళ తెల్లవారు జామున 4 గంటలకే  ఎలుగుబంటి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు కట్టపై ఉన్న స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.   ఘటనా స్థలానికి వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు  ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలుగుబంట్లు వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని..వాటిని అటవీ ప్రాంతం వైపు మళ్ళించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Also Read : ఫుట్ పాత్​పై పడుకున్న వ్యక్తిని పైసల కోసం చంపిండు

రెండు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో ఓ గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. ప్రస్తుతం గొర్రెల కాపరి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.