కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి ఊళ్ల మీద పడింది. గన్నేరువరం మండలం సావట్లలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి గ్రామంలో సంచరించింది. ఎలుగుబంటిని చూసిన కుక్కలు మొరిగాయి.
కుక్కలు విపరీతంగా మొరగడంతో లేచిన గ్రామస్తులు..ఎలుగుబంటిని చూసి ఖంగుతిన్నారు. ఎలుగుబంటి రావడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఎలుగు ఊర్లో కనిపించడంతో...సావట్ల గ్రామస్తుసలు భయాందోళనలో ఉన్నారు.