లింగంపేటలో ఎలుగుబంటి సంచారం !

లింగంపేటలో ఎలుగుబంటి సంచారం !

లింగంపేట, వెలుగు :  లింగంపేట గ్రామ శివారులో ఎలుగుబంటి  సంచరిస్తుండడంతో  రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఉదయం గ్రామ శివారులోని వరి పొలాల్లోకి ఎలుగుబంటి వచ్చినట్లు గ్రామానికి చెందిన నామాల గంగారాం అనే రైతు చెప్పారు. ఎలుగుబంటిని చూసి కేకలు వేయడంతో సమీపంలోని గుట్ట వైపు వెళ్లిందన్నారు.   అటవీశాఖ అధికారులు స్పందించి  ఎలుగుబంటిని పట్టుకుని జూపార్కుకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.