శ్రీశైలం వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంటి : సీసీ కెమెరాలో రికార్డు

శ్రీశైలం వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంటి : సీసీ కెమెరాలో రికార్డు

శ్రీశైలం మల్లన్న దేవాలయం ముఖద్వారం వద్ద సోమవారం ( మార్చి 17) రాత్రి 11 గంటలకు ఎలుగుబంటి హల్​చల్​ చేసింది.  ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ ప్రాకారం ( టెంపుల్​ కమాన్​) దగ్గర అటూ .. ఇటూ తిరుగుతూ శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలకు ఇబ్బంది కలిగించింది.  రోడ్డుపై నడుస్తున్న  ఎలుగుబంటిని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు.  కొంతమంది ఎలుగుబంటి వీడియోను రికార్డ్​  చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

కొంత సేపటి తరువాత ఎలుగుబంటి నెమ్మదిగా రోడ్డు దాటుకుంటూ అడవిలోకి వెళ్లడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు,  గతంలో  అనేక సార్లు ఇక్కడే ఎలుగుబంటి సంచారాన్ని భక్తులు గుర్తించారు.  నల్లమల అటవీప్రాంతంలో వన్య మృగాలు సంచారం ఎక్కువగా ఉంటుందని.. కావున శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.