బీస్ట్.. నెక్స్ట్​ లెవెల్​

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్‌‌ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’.. ఏప్రిల్ 13న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. హీరోయిన్ పూజా హెగ్డే, తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత దిల్‌‌ రాజు, దర్శకుడు  నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ని కమర్షియల్ ఫార్మాట్‌‌లో తీయడం నెల్సన్‌‌కే సాధ్యం. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. పూజ మాట్లాడుతూ ‘తమిళ సినిమాతోనే నా జర్నీ స్టార్టయ్యింది. ఇక్కడి వరకు హ్యాపీగా సాగింది. నెల్సన్‌‌కి చాలా యునిక్‌‌ ఐడియాస్ వస్తాయి. అనిరుధ్ సాంగ్స్‌‌ సినిమాని నెక్స్ట్ లెవెల్‌‌కి తీసుకెళ్లాయి. విజయ్ అయితే నన్ను చాలా ఇన్‌‌స్పైర్ చేశారు’ అని చెప్పింది. ‘నేను తీసిన  డాక్టర్ మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికీ అలాంటి ఆదరణే దక్కుతుందని అనుకుంటున్నా’ అన్నాడు నెల్సన్. పాటల్ని హిట్‌‌ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు అనిరుధ్.