వినూత్న ఆలోచన: ఆటో కప్పుపై 25 రకాల మొక్కలు

వినూత్న ఆలోచన: ఆటో కప్పుపై 25 రకాల మొక్కలు

ఢిల్లీ: ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నరు. మధ్యాహ్నం సమయంలో ఆటోనో.. బస్సో ఎక్కితే ఎండ తీవ్రతకు భరించలేని ఉక్కపోత. దీనిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు.  ఆటో లోపల చల్లగా ఉండాలనే ఆలోచనతో ఓ ప్రత్యేకమైన మొక్కల తొట్టి ఏర్పాటు చేసుకున్నాడు.  వేసవి కాలంలో తన ఆటోలో ప్రయాణిస్తున్న వారికి చల్లగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆటో పై కప్పు అంతా పచ్చని మొక్కలను ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్‌హీట్) తాకినప్పటికీ, తన వాహనం చల్లగా ఉంటుందని ఆటో డ్రైవర్ కుమార్ చెప్పాడు.

రెండేళ్ళ క్రితం వేసవి కాలంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను పైకప్పుపై కొన్ని మొక్కలను పెంచగలిగితే, అది నా ఆటోను చల్లగా ఉంచుతుంది మరియు నా ప్రయాణీకులకు వేడి నుండి ఉపశమనం ఇస్తుందని నేను అనుకున్నాను, "అలాగే ఆటో లోపల రెండు మినీ కూలర్లు, ఫ్యాన్లు కూడా అమర్చాడు. ఇది ఇప్పుడు చిన్న ఎయిర్ కండీషనర్ లాగా ఉంది. నా ప్రయాణీకులు రైడ్ తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు, వారు నాకు అదనంగా చెల్లించడానికి కూడా ఏమీ ఇబ్బంది పడట్లేదు అని చెప్పుకొచ్చాడు మహేంద్ర. ఆటోకప్పుపై 25 రకాల మొక్కలు పెట్టానని చెప్పాడు. ప్రస్తుతం ఆటో రిక్షా డ్రైవర్ మహేంద్ర కుమార్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు.