వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి

వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి

ఎండకాలం ఎండలు దంచికొడుతున్నాయి. అధికఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాల్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటిందంటేచాలు మాడు పగిలిపోయే వేడిమితో ఇళ్లనుంచి బయటికి రావాలంటే భయమేస్తుంది. ఇలాంటి సమయంలో అధిక వేడి, వడగాల్పులతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎండాకాలం వేడిమి, వడగాల్పుల బారిన పడకుండా, ఒకవేళ పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వడదెబ్బ వంటి ఆనారోగ్యం కలిగితే ఏం చేయాలి వంటి విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

వడదెబ్బ లక్షణాలు..

  • కండరాల తిమ్మిరి
  • భారీగా చెమట పట్టడం
  • విపరీతమైన బలహీనత
  • తలనొప్పి
  • వాంతులు
  • అధిక హార్ట్ బీట్
  • ముదురు రంగు మూత్రం
  • పాలిపోయిన చర్మం

వడదెబ్బ తగిలితే ఇలా చేయండి..

  • వడదెబ్బ తలిగిన వ్యక్తిని నీడలో ఉంచాలి. 
  • బిగుతుగా ఉన్న బట్టలు విప్పాలి. 
  • శరీర భాగాలకు చల్లటి గాలి తగిలేలా చూడాలి. 
  • బట్టను చల్లని నీటిలో ముంచి శరీరంపై అద్దుతూ ఉండాలి. 
  • ఉప్పు కలిపిన నీరు, మజ్జిక, గంజి లేదా గ్లూకోజ్ నీళ్లు తాగించాలి. 
  • స్పృహ కోల్పోయినట్లయితే పడుకున్న బెడ్ పై కాళ్లవైపు ఎత్తైన మెత్తలు ఉంచాలి.  
  • శరీర పైభాగంకంటే పాదాలు ఎత్తుగా ఉండేలా చూడాలి. 
  • అవసరమైతే డాక్టర్లు సలహా మేరకు పారాసిటమాల్ టాబ్లెట్ వాడొచ్చు. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను వేగంగా తగ్గిస్తుంది.

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. 

  • సాధ్యమైనవంతవరకు నీడపట్టున ఉండాలి. 
  • అవసరమైతే తప్పా బయటికి వెళ్లకూడదు. 
  • ఎండనుంచి వచ్చిన వెంటనే తీపి పదార్ధాలు, తేనె వంటి వంటి తీసుకోకూడదు. 
  • పుచ్చకాయం జూస్ తీసుకోవాలి. కొబ్బరినీళ్లు కొంచెంకొంచెం గా తాగాలి. 
  • వదులుగా ఉండే తెల్లటి బట్టలు ధరించాలి. 
  • నిమ్మరసం, మజ్జిగ,చెరుకు రసం వంటి పానీయాలు తీసుకోవచ్చు. 

వడదెబ్బను నివారించడానికి చిట్కాలు..

  • వదులుగా ఉండే, తేలికపాటి, లేత రంగు దుస్తులను ధరించండి.
  • చల్లని ద్రవాలు త్రాగండి ,డీ హైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి.
  • ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది దానిని నివారించాలి.
  • దోసకాయ, పుచ్చకాయలు, దానిమ్మ ,అరటిపండు వంటి పండ్లను తినాలి. 
  • వేడి వాతావరణంలో అధిక వ్యాయామం చేయొద్దు.. 
  • ఏరోబిక్ వ్యాయామాలకు బదులుగా తేలికపాటి వ్యాయామాలు ,ఈత కొట్టడంలో లాంటివి చేయాలి. 
  • పూర్తి కవరింగ్ ఇంకా వదులుగా ఉండే దుస్తులు, టోపీ, సన్ గ్లాసెస్ ,సన్ స్ర్రీన్ నుంచి రక్షించుకోవాలి. 
  • ఒకవేళ మీకు వడదెబ్బ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే అవసరమైన అన్ని జాగ్రత్తలు వైద్యుల సాయం తీసుకోవాలి.