వీడియో: సరిహద్దులో భారత్, పాక్ సైనికుల పరేడ్

వీడియో: సరిహద్దులో భారత్, పాక్ సైనికుల పరేడ్

అది భారత్ పాకిస్థాన్ సరిహద్దు.. రెండు దేశాలకు మధ్య ఒక్క గేటు మాత్రమే అడ్డు.. అదే పంజాబ్‌లోని అట్టారీ, వాఘా బోర్డర్. ఇక్కడే జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకుని నిర్వహించే బీటింగ్ రిట్రీట్ చూస్తుంటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత ఉద్విగ్నభరితంగా హిందుస్థాన్ జిందాబాద్ అన్న నినాదాలు వినబడుతుండగా పరేడ్ చేస్తారు మన బీఎస్ఎఫ్ సైనికులు.

ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు పోట్లాటకు వెళ్తున్నారా అన్నట్టుగా ఈ కార్యక్రమం సాగుతుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఇవాళ అట్టారీ వాఘా బోర్డర్‌‌లో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ పరేడ్ చూసేందుకు సైనికులతో పాటు పంజాబ్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

ప్లాస్టిక్ వస్తువులపై ఒమిక్రాన్ లైఫ్ 8 రోజులు

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

చైనా చెరలోని బాలుడి అప్పగింతకు ప్లేస్‌ ఫిక్స్