IND vs AUS: తొలి టెస్టులో ఓటమి.. ఆల్ రౌండర్‌ను జట్టులో చేర్చిన ఆస్ట్రేలియా

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆస్ట్రేలియా క్రికెట్ 14 మంది తన స్క్వాడ్ తో జట్టును ప్రకటించింది. తొలి టెస్టు కోసం 13 మందిని ప్రకటించగా.. రెండో టెస్టుకు అదనంగా అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ ను స్క్వాడ్ లో చేర్చారు.

వెబ్‌స్టర్ కు తుది జట్టులో చోటు లభించడం కష్టంగానే కనిపిస్తుంది. అతను మిచెల్ మార్ష్ కు బ్యాకప్ గా ఉంటాడు. గ్రీన్ లేకపోవడంతో ఆసీస్ జట్టు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మాత్రమే ఉన్నాడు. వెబ్‌స్టర్ రాకతో ఆసీస్ కు మరింత బలం చేకూరనుంది. భారత్, 'ఎ'తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ ఆసీస్ యువ ఆల్ రౌండర్ అద్భుతంగా రాణించాడు. 72.50 సగటుతో 145 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లోనూ ఏడు వికెట్లు పడగొట్టాడు. 

ALSO READ | IND vs AUS: ఆస్ట్రేలియా ప్రధానితో భారత క్రికెటర్లు.. బుమ్రాకు ప్రత్యేక ప్రశంస

వెబ్‌స్టర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 5000 ఫస్ట్ క్లాస్ పరుగులతో పాటు 150 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ తర్వాత టీమిండియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.నవంబర్ 30, డిసెంబర్ 1న జరగబోయే ఈ మ్యాచ్ కు కాన్ బెర్రాలోని మనుకా ఓవల్‌ ఆతిధ్యమివ్వనుంది. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహిస్తాడు. అడిలైడ్ లో డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్ టెస్ట్ ప్రారంభమవుతుంది.