మాట్లాడేటప్పుడు చాలామంది ఫేస్ చూస్తారు. అందులోనూ మాట్లాడేటప్పుడు పైకి... కిందకు కదిలే లిప్స్ (పెదవులను) చూస్తారు. అందుకే వీటిని అందంగా కనిపించేలా మేకప్ వేసుకుంటారు. సాధారణంగా లిఫ్ స్టిక్ వేసుకోనిదే మహిళలు బయటకు రారు. ఫంక్షన్స్ కు వెళ్లినా.. రెండు మూడు రోజులు టూర్ వెళ్లినా.. హ్యాండ్ బ్యాగ్ లో కచ్చితంగా లిఫ్ స్టిక్ ఉండాల్సిందే. అయితే ఓ వయస్సు వచ్చిన తరువాత లిప్ గ్లాస్ వాడొద్దని నిపుణలు సూచిస్తున్నారు. మరి పెదాలు అందంగా కనపడాలంటే పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం. . .
- పెదవులు అందంగా .. నిండుగా కనిపించాలంటే పెదవుల అంచుల నుంచి లైనర్ రాయాలి. అలాగే కింది పెదవి మధుర కొద్దిగా లిప్ గ్లాస్ అద్దుకుంటే చాలు. పెదవులు అందంగా కనిపిస్తాయి.
- వయసు పెరిగే కొద్దీ పెదవుల సైజులో మార్పు వస్తుంది. అందుకే ఒక వయసు వచ్చాక మ్యాటీ లేదా గ్లాసు వేసుకోవద్దు.
- లిఫ్ స్టిక్ వేసుకున్న తర్వాత ఐస్ ముక్కతో పెదవులపై అద్దాలి. ఇలా చేస్తే లిఫ్ స్టిక్ చెదిరిపోకుండా... ఎక్కువ సేపు ఉంటుంది.
- చాలామంది ముదురురంగు లిప్ స్టిక్ వేసుకుంటారు. ఇది.. చూడ దానికి అంత బాగుండదు.
- పెదవులకు ముందుగా లైనర్ ని వేసుకుని, తర్వాత ఎంచుకున్న ముదురు రంగు లిఫ్ స్టిక్ వేసుకో వాలి. అప్పుడే లిఫ్ స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. ఒకవేళ లేతరంగు లిఫ్ స్టిక్ అయితే న్యూడ్ లైనర్నే వాడాలి,
- లిఫ్ స్టిక్ వేసుకోవడం పూర్తయిన తరువాత పెదవుల మధ్య మెత్తని టిష్యూ పేపర్ పెట్టి పెదవులతో అద్దాలి. ఇలా చేయడం వల్ల లిఫ్ స్టిక్ ఏమైనా ఎక్కువ తక్కువలుంటే సరిచేసినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల పళ్లపై లిఫ్ స్టిక్ మరకలు పడకుండా ఉంటుంది.
- పెదవులకు రెడ్ కలర్ లిప్ స్టిక్ వేసుకోవాలంటే మేకప్ చాలాసింపుల్ గా ఉండాలి. అప్పుడే పెదవుల రంగు ఎక్కువగా కనిపించదు.
-వెలుగు, లైఫ్–