
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ‘భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్ రూపొందిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్ సమర్పణలో అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు.
అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ని కూడా ఇందులో చూపించారు. అంకిత్ కొయ్య, నీలఖితో పాటు నరేష్, వాసుకి పాత్రల్ని పరిచయం చేశారు. బండి కొనిపిస్తే చాలని ఇక జీవితంలో ఏమీ అడగను అని హీరోయిన్ తన తండ్రి నరేష్‌తో అనడంతో సినిమా మొత్తం ఆ బండి చుట్టూనే తిరిగేలా అనిపిస్తోంది. విజువల్స్‌తో పాటు విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది.