అందం : టూర్లు వెళుతున్నారా.. మేకప్ కిట్ ఇలా సెట్ చేసుకోండి..

అందం : టూర్లు వెళుతున్నారా.. మేకప్ కిట్ ఇలా సెట్ చేసుకోండి..

ట్రావెలింగ్ చేసేటప్పుడు మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ వెంట తీసుకెళ్లడం వీలుకాదు. అలాగని టెన్షన్ ట్రా అక్కర్లేదు. ఎందుకంటే రెండు విధాలా పనికొచ్చే మేకప్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ఇవి వెంట ఉంటే జర్నీలోనూ మేకప్ రొటీన్ మిస్ అవ్వరు.

బ్రౌన్ కాజల్

చాలామంది నల్ల కాటుక పెట్టుకునేందుకే ఇష్టపడతారు. అయితే, కొత్తగా కనిపించాలి అనుకుంటే బ్రౌన్ కాజల్ ట్రై చేయొచ్చు. బ్రౌన్ కలర్ కాటుక కూడా మంచి లుక్ నిస్తుంది. దీన్ని వాటర్న్ మీద రాసుకోవచ్చు. ఐ షాడోగా కూడా పనికొస్తుంది. ఐ బ్రోఫిల్లర్గా వాడొచ్చు.

లిక్విడ్ లైటర్

ముఖాన్ని హైలైట్ చేసేందుకు లిక్విడ్ హైలైటర్ ఉపయోగ పడుతుంది. దీన్ని ముక్కు చివరలు, కాలర్ బోన్ దగ్గర, కనుబొమల వద్ద, బుగ్గల మీద రాసుకుంటే మెరుస్తూ కనిపిస్తాయి. లిక్విడ్ హైలైటర్ ని లోషన్తో కలిపి ముఖానికి రాసుకోవచ్చు కూడా.

లిప్ అండ్ చీక్ టింట్స్

కొందరికి ప్రతిసారి లిప్లిక్ వాడడం. నచ్చదు. కానీ, లిప్స్ లైట్ కలర్ లో ఉండాలి. అనుకుంటారు. అలాంటి వాళ్లకి టింట్స్ బెస్ట్ ఆప్షన్. ఇది తేలికగా ఉండి ఎక్కువ టైం ఉంటుంది. అంతేకాకుండా చీక్ టింట్ చెంపలకలర్ బుగ్గలకి షైనింగ్ తెస్తుంది.

ఫిక్సింగ్ స్ప్రే

మేకప్ కి ముందు ప్రైమర్ రాసుకోవడం తప్పని సరి. ఆ తర్వాత సెట్టింగ్ స్ప్రే (మిస్ట్) ఉండాలి. అయితే, ఫిక్సింగ్ స్ప్రేని ప్రైమర్ గా, సెట్టింగ్ స్ప్రేగానూ వాడొచ్చు. ఫిక్సింగ్ స్ప్రేని వాడితే మేకప్ తొందరగా చెదిరిపోదు. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ఈ స్ప్రే చాలా ఉపయోగపడుతుంది.