
ఇప్పుడు ప్రతి కిచెన్ లో డైనింగ్ టేబుల్ ఉంటుంది. అది ఎలా పడితే అలా ఉంటే.. ఇంటి అందాన్ని చెడగొడుతుంది. డైనింగ్ టేబుల్ అందంగా రిచ్ లుక్ లో ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
డైనింగ్ టేబుల్ పై అలంకరించడానికి ఏముంటుంది? అని చాలామంది. అంటుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డైనింగ్ టేబుల్ ను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. రంగురంగుల ఎంబ్రాయిడరీ మ్యాట్స్, టేబుల్ మధ్య క్యాండిల్స్, కలర్ ఫుల్ ఫ్లవర్స్, పెండాంట్ లైటింగ్ ఇదే లేటెస్ట్ డైనింగ్ టేబుల్ డెకరేషన్.. మరి వాటి ఎంపిక ఎలాగంటే...
- డైనింగ్ టేబుల్ పై క్లాత్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల టేబుల్ క్లాత్స్ అందుబాటులో ఉన్నాయి. కాటన్, సిల్క్, రేయాన్, జూట్, పాలిస్టర్లలో ఎవరికి ఏది నచ్చితే అది ఎంచుకోవచ్చు. ప్రింటెడ్, డిజైనర్, ప్లెయిన్, ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన క్లాత్‌లు కూడా డైనింగ్టేబుల్ కు రిచ్ లుక్ ను ఇస్తాయి.
- డైనింగ్ టేబుల్ డెకరేషన్ లో టేబుల్ మ్యాట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి.
- ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల డిజైన్లు, రంగుల్లో మ్యాట్స్ లభిస్తున్నాయి. సైజు, రంగు, డిజైన్ ను బట్టి వీటి ధర ఉంటుంది.
- మంచి డిజైన్, ఆకర్షణీయమైన రంగుల్లో కాటన్లేక నారతో చేసిన మ్యాట్లు అందుబాటులో ఉన్నాయి. రంగుల్లో ఉన్న, 'స్ట్రా టేబుల్ మ్యాట్లు' ఆకర్షణీయంగా ఉంటాయి.'జూట్ టేబుల్ మ్యాట్స్' కూడా టేబుల్ కి క్లాసీ లుక్ ఇస్తాయి.
- డైనింగ్ టేబుల్ కు క్యాండిల్సే స్పెషల్ ఎట్రాక్షన్. కుర్చీలో కూర్చుంటే మీ కంటి ఎత్తు కంటే కొన్ని ఇంచులు కిందకు ఉండేలా క్యాండిల్స్ అమర్చుకోవాలి. టేబుల్ మధ్యలో అమర్చుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది.
- డ్రైనింగ్ రూమ్‌కి పెండాంట్ లైటింగ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఒకవేళ డైనింగ్ టుబుల్ గుండ్రంగా ఉన్నట్లయితే ఒక్కటే లార్జ్ పెండాంట్ను అమర్చుకుంటే సరిపోతుంది. డైనింగ్ టేబుల్ ఇంకా రిచ్ లుక్రావాలంటే షాండ్లియర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
- డైనింగ్ రూమ్ చిన్నగా ఉంటే తేలికగా ఉండే ఫర్నిచర్ను ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో బ్యాంబూ, కేస్ ఫర్నిచర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉడెన్లో ఫర్నిచర్ కన్నా ఈ ఫర్నిచర్ను తక్కువ స్థలంలో అమర్చుకోవచ్చు.
- అలాగే టేబుల్ మధ్యలో ఫ్లవర్వాజ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం .. మీ మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.