Summer Beauty : పుచ్చకాయ ఫేస్ ప్యాక్.. అందం రెట్టింపు

సమ్మర్ లో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎండలో తిరిగొచ్చి పుచ్చకాయ తింటే శరీరం కూల్ అవుతుంది. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పుచ్చకాయ తింటే వేసవిలో డీహైడ్రేషన్ నుంచి బయటపడొచ్చు. అయితే పుచ్చకాయతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారు బ్యూటీషిన్లు. ఎందుకంటే, పుచ్చకాయలో లైకోఫేస్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగించి చర్మాన్ని అందంగా ఉంచుతుంది. అలాగే పుచ్చకాయ చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల కాంతివంతంగా కనిపిస్తుంది.

పుచ్చకాయ ఫేస్ ప్యాక్.. నేచురల్ స్కిన్ టోనర్గా, క్లెన్సర్ కూడా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. పచ్చకాయలో ఉండే విటమిన్ ఎ, బి6, సి.. వేసవిలో మంచి ఔషధంలా పనిచేస్తాయి. చర్మం పొడిగా ఉన్నవాళ్లు పుచ్చకాయ తిన్నా, ఫేస్ ప్యాక్ వేసుకున్నా చాలా మంచిది. వయసు పెరిగేకొద్ది ముఖం మీద వచ్చే ముడతలను పుచ్చకాయ ఫేస్ ఫ్యాక్ తగ్గిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఆక్ ని సమస్య నుంచి కూడా కాపాడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఈ ప్యాక్ తయారు చేసుకోవాలి.