వర్షాకాలం మొదలైంది. చిన్నపాటి వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. వాతావరణమంతా చల్లగా ఉంది కానీ... ఈ వర్షాకాలంలో మేకప్ వేసుకొని బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడిపోతారు. ఒక్కసారి వర్షంలో తడిస్తే.. కష్టపడి వేసుకున్న మేకపంతా పోతుంది. అంతేకాదు చాలా మంది ఈ కాలంలో ఎలాంటి మేకప్ వేసుకోవాలి అనే విషయంపై కూడా పెద్దగా క్లారిటీ ఉండదు. అయితే ఈ రోజు సులభమైన చిట్కాలు ఫాలో అయితే.. వర్షాకాలంలో మేకప్ సమస్య తీరుతుంది
వర్షాకాలం వచ్చిందంటే చాలు రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ ఆఫీసుకో, కాలేజీకో వెళ్లే అమ్మాయిలు. మేకప్ వేసుకోవడం వారికి సమస్యగా మారుతుంది. వర్షంలో తడిచి మేకప్ మొత్తం పాడవుతుంది. ఎందుకంటే వర్షం నీరు ముఖంపై పడి మేకప్ పాడైపోతుంది. గొడుగు లాంటివి వాడినా.. గాలికి వర్షపు జల్లులు ముఖంపై పడే అవకాశం ఉంది. అంతేకాదు కొంతమంది అమ్మాయిల హెయిర్ స్టైల్ కూడా పాడైపోతుంది. దీంతో చర్మం జిగటగా, తడిగా మారుతుంది. ఏదైనా పార్టీకి, ఫంక్షన్‌కి వెళ్లాల్సి వచ్చి.. మేకప్ చేసుకోలేకపోతే ఈ చిట్కాలు ట్రై చేయవచ్చు.
వర్షాకాలం మేకప్ వేయడం ఒక సవాలు. ఆ సమయంలో దోషరహిత అలంకరణ చేయవచ్చు. దీనికోసం ఈ చిట్కాలను అనుసరించాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనికోసం ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ ఉపయోగించవచ్చు. ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ ఉపయోగించడం వల్ల తడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
మంచు మసాజ్: ఆయిల్ ఫ్రీ ఫేస్‌వాష్ ఉపయోగించిన తర్వాత.. ముఖాన్ని ఐస్‌తో మసాజ్ చేయాలి. కొన్ని ఐస్ ముక్కలను ఒక గుడ్డలో తీసుకొని వాటిని ముఖంపై సున్నితంగా కదిలించవచ్చు. ముఖానికి ఐస్ వాడితే మేకప్ చాలా కాలం పాటు ముఖం మీద ఉంటుంది.
టోనర్: మేకప్ వేసుకునే ముందు ఐస్ ఉపయోగించిన తర్వాత టోనర్ ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేసి చర్మాన్ని ఆయిల్ ఫ్రీగా మార్చుతుంది. మీ చర్మానికి అనుగుణంగా టోనర్‌ని ఉపయోగించవచ్చు. టోనర్‌ని ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా ప్రైమర్‌ను అప్లై చేయాలి. చర్మ రకాన్ని బట్టి ప్రైమర్‌ని ఎంచుకోవచ్చు.
ప్రైమర్: ప్రైమర్ మేకప్ ఎక్కువసేపు ఉండటానికి.. తడొ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో వర్షపు చినుకులు ముఖంపై పడి మేకప్ పాడవుతుంది. మీరు మేకప్ వేసుకునే ముందు బ్లాటింగ్ పేపర్‌ని ఉపయోగించవచ్చు లేదా బ్లాటింగ్ షీట్‌లను ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని అదనపు నూనెను పొడిగా చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆయిల్ ఫ్రీగా చేస్తుంది.దాని సహాయంతో ఎక్కువసేపు మేకప్ ఉంచుకోవచ్చు. బ్లాటింగ్ పేపర్ అనేది టిష్యూ పేపర్ లాంటిది.
మేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్ వాడటం వల్ల ముఖం మీద మిగిలిపోయిన తేమతోపాటు పేరుకున్న దుమ్ము, ధూలి లాంటివి కూడా పోతాయి. తర్వాత టోనర్ వేసుకోవాలి. టోనర్ తో ముఖం మీది చర్మ రంధ్రాలు కుంచించుకుపోతాయి. టోనర్ పీహెచ్ వాల్యూ సమం చేసి.. వర్షాకాలానికి తగ్గట్టుగా చర్మాన్ని సిద్ధం చేస్తుంది.
వర్షాకాలంలో కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. ముఖం మీద మేకప్ ప్యాచులు ప్యాచుల్లా కాకుండా నీట్ గా రావాలంటే.. మేకప్ వేసుకోవడానికి ముందు ఐస్ ముక్కతో ముకాన్ని రద్దుకోవాలి. తర్వాత మేకప్ వేసుకుంటే బాగుంటుంది.
వర్షాకాలంలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. చర్మం రంగులో కలిసిపోయే ఫౌండేషన్ ని ఎంచుకొని కొద్దిగా రాసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ వాడటం మర్చిపోవద్దు. పౌడర్ కి బదులు కాంపాక్ట్ పౌడర్ వాడితే ముఖం తాజాగా ఉంటుంది. ఇక ఇది వర్షాకాలం కాబట్టి మస్కారా, కోల్ వాటర్ ఫ్రూఫ్ వాడటం బెటర్. మేకప్ అంతా పూర్తి అయ్యింది అనుకున్న తర్వాత చివర్లో సెట్టింగ్ స్ప్రే ని వినియోగించాలి. దీని వల్ల మేకప్ ఎక్కువ సేపు చెక్కుచెదరకుండా ఉంటుంది.
ఈ చిట్కాలన్నింటినీ పాటించడం ద్వారా వేసవిలో మీ మేకప్‌ను సులభంగా ఉంచుకోవచ్చు. ఇది కాకుండా.. వర్షాకాలంలో హెవీ ఫౌండేషన్‌ను నివారించి.. హెవీ మేకప్‌కు బదులుగా తేలికపాటి మేకప్‌ను వేసుకుంటే మంచిది బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.