Beauty Tips : జుట్టుకు రంగు వేస్తు్న్నారా.. ఇంట్లోనే హెయిర్ కలర్ ఇలా.. జాగ్రత్తలు ఇలా..!

Beauty Tips : జుట్టుకు రంగు వేస్తు్న్నారా.. ఇంట్లోనే హెయిర్ కలర్ ఇలా.. జాగ్రత్తలు ఇలా..!

ఫ్యాషన్ కావొచ్చు.. తెల్ల వెంట్రుకలు కనబడకుండా కావొచ్చు.. జుట్టుకి రంగు వేయడం సాధారణంగా మారింది, కానీ వీటిని ఎక్కువగా వాడితే కళ్లు, చర్మం ఇరిటేట్ అవుతాయి. అలర్జీలూ వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఉండే రసాయనాల వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశమూ ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప రంగు వేసుకోకూడదు. ఒకవేళ తప్పదు. అనుకుంటే కొన్ని జాగ్రత్తలతో పాటు ఈ చిట్కాలు పాటించాలి.

 ఈ జాగ్రత్తలు పాటించాలి 

  •   తలకు రంగు వేయాలనుకున్నప్పుడు ముందు మీకు పడుతుందో లేదోపరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా రియాక్షన్ వస్తే వాటికి దూరంగా ఉండాలి.
  •   కలర్స్ వాడుతున్నప్పుడు వెంట్రుకల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెట్టాలి. అలోవెరా, గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, పువ్వులు, గుంటగలగర ఆకులు లాంటి ప్రకృతి సిద్ధమైన వాటిని నేరుగానో, నూనె ద్వారానో జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల రంగు వేసినా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  •   హెయిర్ కలర్స్ ఎంచుకునేటప్పుడు రసాయనాలు ఉన్నవి కాకుండా... నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ఎలాంటి హెయిర్ డై అయినా వారానికి ఒకసారి వేస్తూ పోతే వెంట్రుకలు, కుదుళ్లు బలహీనం అవుతాయి.అందుకే మూడు. నాలుగు వారాలకి ఒకసారి మాత్రమే వీటిని అప్లై చేయడం మంచిది. 
  • చాలామంది కలర్ వేసుకున్న రెండుమూడు రోజుల్లో రంగు పోతుంది. దాంతో మళ్లీ మళ్లీ వేస్తుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే నాణ్యమై కలర్స్ నే ఎంచుకోవాలి. ముఖ్యంగా అమ్మోనియా, సల్ఫేట్ వంటి రసాయనాలు లేకుండా చూసుకోవాలి. అంతేకాదు రంగు వేసుకునే ముందు  రెండు రోజులు నుంచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకి రంగు సరిగా పడుతుంది. అలాగే పాడవదు. 
  • తలకి రంగు వేసుకున్నాక మరుసటి రోజే తలస్నానం చేయకూడదు. కనీసం రెండు రోజులు ఆగి తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకి రంగు బాగా పడుతుంది. అలాగే రంగు వేసుకున్న తర్వాత వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల రంగు వేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే వేడినీళ్లు మాడులోని వెంట్రుకల కుదుళ్లని తెరుచుకునేట్టు చేస్తాయి. దాంతో రంగు త్వరగా వెలసిపోతుంది. అంతేకాదు వేడినీళ్ల వల్ల జుట్టులో సహజంగా ఉండే తేమ కూడా పోతుంది. అందుకే వేడినీళ్లకి బదులుగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. 
  • జుట్టుకి రంగేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి నాణ్యమైన కండిషనర్ వాడాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు రంగు బాగా పట్టి ఆరోగ్యంగా కనిపిస్తుంది. పీచులా పొడిబారిన జుట్టుకు రంగు వేయడం వల్ల చూసేందుకు ఏమాత్రం బాగుండదు. పైగా అసహజంగా కనిపిస్తుంది. 

ఇంట్లోనే హెయిర్ కలర్

చాలామంది జుట్టు ఇలా నెరిసిందో లేదో.. అలా రంగు వేసేస్తుంటారు. రసాయనాలు కలిపిన రంగుల గాఢతను జుట్టు భరిస్తుందో లేదోనని ఆలోచించరు. కొందరు ఒక్కసారి రంగేస్తే ఏమవుతుందంటారు. కానీ ఒక్కసారి జుట్టుకి రంగు వేస్తే చాలు.. అందులోని రసాయనాలు జుట్టు సహజత్వాన్ని దెబ్బతీస్తాయి. దానివల్ల జుట్టు సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందుకే ఒకవేళ రంగు వేయక తప్పదనుకుంటే ఇంట్లోనే సహజసిద్ధంగా హెయిర్ కలర్స్ రెడీ చేసుకోవచ్చు. ఇలా...

తులసితో

కావాల్సినవి బ్లాక్ టీ 5 టేబుల్ స్పూన్లు తులసి ఆకులు- ఐదు నిమ్మరసం- రెండు మూడు చుక్కలు తయారీ బ్లాక్టీలో తులసి ఆకులు వేసి సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి చల్లార్చి జుట్టుకి రాయాలి. ఇలా వారానికి ఒకసారి మూడునెలలు పాటు చేస్తే చుండ్రు సమస్యలతో పాటు తెల్లవెంట్రుకలు కూడా నల్లగా మారతాయి.

ఉసిరికాయలతో

కావాల్సినవి

ఎండు ఉసిరి - 100 గ్రాములు నీళ్లు- ఒక గ్లాసు ఐరన్ పాన్-1 

తయారీ

విత్తనాలు తీసిన ఎండు ఉసిరికాయ లను పాన్లో వేసి సన్నని మంటమీద వేగించాలి. ఉసిరికాయ ముక్కలు నలుపు రంగులోకి వచ్చే వరకు అంటే దాదాపు అరగంట పాటు వేగించాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని 12 గంటల పాటు చల్లార చ్చి పట్టాలి. తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి జుట్టుని ఆరబెట్టి ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. రెండు గంటల తర్వాత జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే జుట్టు సహజంగానే నలుపు రంగులోకి వస్తుంది. అలాగే ఈ మిశ్రమాన్ని రాసుకున్నప్పుడు షాంపు, హెయిర్ ర్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలి.