అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బీఈడీ, స్పెషల్ బీఈడీ నోటిఫికేషన్ రిలీజ్

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బీఈడీ, స్పెషల్ బీఈడీ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ, స్పెషల్ బీఈడీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2024–25 నోటిఫికేషన్ రిలీజైంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 21 వరకూ గడువు ఉందని వర్సిటీ అధికారులు ప్రకటించారు. 

అభ్యర్థులు వర్సిటీ పోర్టల్ www.braouonline.in ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఎంట్రెన్స్ ఫీజు రూ. వెయ్యి ఉందని, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు రూ.750 ఉంటుందని వెల్లడించారు.