శవయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పరుగో పరుగు

శవయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పరుగో పరుగు

పుండు మీద కారం చల్లిన్నట్లు.. కుటుంబంలోని వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్నవారిపై తేనేటీగలు దాడి చేశాయి. దీంతో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగూడ మండల కేంద్రంలో ఎంచగూడంలో రుద్రారపు వీరాస్వామి అనే వ్యక్తి చనిపోగా.. అంత్యక్రియల్లో భాగంగా శవయాత్ర నిర్వహించారు. 

వీరాస్వామికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించిన కటుంబ సభ్యులు.. శవయాత్రలో టపాసులు పేల్చుకుంటూ ముందుకు సాగారు.  అయితే, గ్రామం చివరికి చేరుకున్న క్రమంలో.. టపాసుల శబ్ధం, మెరుపులకు రోడ్డు పక్కన చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి.. దాడి చేశాయి.  భయంతో శవాన్ని కింద వదిలేసి తలో దిక్కు పారిపోయారు. తేనెటీగల దాడిలో దాదాపు 20 మంది గాయపడటంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.