వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూ.. ‘ప్రజా ప్రస్థాన యాత్ర’ మొదలుపెట్టారు. ఆ యాత్ర 34వ రోజు నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలో సాగుతోంది. నియోజకవర్గంలో ప్రజలను క్షేత్రస్థాయిలో కలుస్తున్నారు. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి మలివిడత పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో నేడు అపశృతి తలెత్తింది. మోటకొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో దుర్గసానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో కార్యకర్తలు పరుగులు తీశారు. కానీ, షర్మిల మాత్రం అలాగే పాదయాత్ర కొనసాగించారు. ఆమె అనుచరులు తేనేటీగలను కండువాలతో ఊపుతుండగా.. ఆమె నడక సాగించారు. షర్మిల సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో.. తేనెటీగల దాడి నుంచి వైఎస్ షర్మిల బయటపడ్డారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు చందేపల్లి గ్రామంతో 400 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ప్రజాసమస్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని షర్మిల అన్నారు.
పాదయాత్రలో షర్మిలపై తేనెటీగల దాడి
- తెలంగాణం
- March 23, 2022
లేటెస్ట్
- తెలంగాణాలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- 2030 నాటికి మూసీ డెవలప్మెంట్ కంప్లీట్.. టార్గెట్ తో ముందుకెళ్తున్న ప్రభుత్వం..
- తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం : డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు
- Sankranthiki Vasthunnam: 3 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ విక్టరీ
- పోటా పోటీగా మోదీ క్రికెట్ కప్
- జీతాలు రావడంలేదని ఈజీఎస్ సిబ్బంది ఆందోళన
- మళ్లీ మొదలైన సింగరాయ జాతర లొల్లి
- 300 కోట్ల ఉపాధి బిల్లులు విడుదల..పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన సర్కారు
- చెత్త పని పట్టే జటాయు.. ఏ వేస్టేజ్ అయినా లాక్కుంటుంది
- ప్రధాని మోదీకి రైతులు రుణపడి ఉంటారు :ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Most Read News
- Technology: ఫోన్ చేస్తే నెంబర్ కాదు.. ఇక నుంచి మీ పేరు కనిపిస్తుంది
- Crime Thriller: థియేటర్స్లో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ.. 6 కోట్ల బడ్జెట్, రూ.30 కోట్ల వసూళ్లు
- మీకు కోడింగ్ లో దమ్ముంటే.. కోటీశ్వరులను చేస్తా : ఎలన్ మస్క్ ఓపెన్ ఆఫర్
- BGT 2024-25: హెడ్, కమ్మిన్స్ కాదు.. ఆ ఒక్కడు లేకపోతే టీమిండియా సిరీస్ గెలిచేది: అశ్విన్
- ఆ నాలుగు కొట్టుకుని చచ్చాయి.. చూస్తూ ఉన్న కోడి కోటి రూపాయలు గెలిచింది
- జనాలు లేకపోవటంతో గేమ్ ఛేంజర్ కి థియేటర్స్ తగ్గిస్తున్నారట..
- ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?
- Team India: నా తండ్రికి గుండెపోటు.. జట్టు నుంచి తప్పించారని చెప్పలేకపోయా: భారత ఓపెనర్
- OMG : అర్థరాత్రి ఒళ్లంతా రక్తం.. ఆటోలో ఆస్పత్రికి సైఫ్ అలీఖాన్
- Team India: టీమిండియా బ్యాటింగ్ కోచ్గా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్