
సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ హత్య కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసులో మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ అరెస్ట్ కావడంతో ధనంజయ్ చుటూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో ధనంజయ్ పై ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నేతలు సైతం ఆయనపై విమర్శలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా సీఎం ఫడ్నవీస్ కు రాజీనామా సమర్పించారు మంత్రి ధనంజయ్. ధనంజయ్ రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు సీఎం ఫడ్నవీస్.
దేశ్‌ముఖ్ హత్య కేసులో సిఐడి చార్జిషీట్ పరిణామాలను, కరాడ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఘటనలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం ( మార్చి 3, 2025 ) రాత్రి ఫడ్నవీస్‌ను కలిసినట్లు సమాచారం. "ధనంజయ్ ముండేను ఈరోజే ( మార్చి 4, 2025 ) మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫడ్నవీస్ కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆహార, పౌర సరఫరాల మంత్రిగా వ్యవహరిస్తున్న ముండే.. గతంలో బీడ్ సంరక్షక మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పూణేతో పాటు బీడ్ జిల్లాకు సంరక్షక మంత్రిగా ఉన్నారు.
Also Read:-ఆరు నెలల కింద గోవాలో ప్రేమ పెండ్లి.. ఇంతలోనే నవ వధువు..
సంతోష్ దేశ్‌ముఖ్ హత్యపై ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే ముండే మంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. హత్యకు సంబంధించిన దోపిడీ కేసులో ఆయన సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ అరెస్టు కారణంగా ముండే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనంజయ్ ముండే ఈరోజు రాజీనామా చేయకపోతే, సభ కార్యకలాపాలను అడ్డుకుంటామని ప్రతిపక్షం ప్రకటించింది.ధనంజయ్ ముండే ఇవాళ సీఎం ఫడ్నవీస్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు.