దండకారణ్యంలో కొత్త బేస్ క్యాంప్

దండకారణ్యంలో కొత్త బేస్ క్యాంప్

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలోకి చొచ్చుకుపోతున్న కేంద్ర భద్రతా బలగాలు తాజాగా శనివారం బీజాపూర్​ జిల్లా భీకర అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో కొత్త బేస్  క్యాంప్​ను ఏర్పాటు చేశాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన సీఆర్పీఎఫ్​ బలగాలు సమీప గ్రామాల్లో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

బేస్​ క్యాంప్​ను నిర్మించుకున్నాక బలగాలు అక్కడ అన్ని ఏర్పాట్లు, సౌలతులు కల్పించుకున్నాయి. గ్రామస్తులతో సమావేశమై గ్రామాభివృద్ధికి బలగాలు తోడ్పడతాయని వారిలో భరోసా నింపారు. 2026 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామన్న కేంద్ర హోంశాఖ, తన యాక్షన్​ ప్లాన్​ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే మావోయిస్టుల ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది.